This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
శివకర్ బాపూజీ తలపడే | |
---|---|
జననం | 1864[1] Bombay (now Mumbai) |
మరణం | 1916[1] |
మరణ కారణం | Unknown |
జాతీయత | Indian |
విద్య | Sir Jamsetjee Jeejebhoy School of Art |
గుర్తించదగిన సేవలు | Constructed and Tested the first Indian unmanned aircraft |
పిల్లలు | Three (two sons and one daughter) |
శివకర్ బాపూజీ తలపడే ( (1864–1916) ) భారత శాస్త్రవేత్త.[1] ఈయన సుబ్బరాయ శాస్త్రితో కలసి 1895 లో తొలివిమానాన్ని నిర్మించి ఆకాశ గమనాన్ని విజయవంతంగా నిర్వహించారట. వీరు మహారాష్ట్ర వాసులు. ఈయన తయారు చేసిన మానవ రహిత విమానం 1500 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు.[2] రైటు సోదరుల ప్రయోగాలకు 8 యేండ్ల పూర్వమే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఆనాటి దినపత్రికలలో ఈ వార్తాంశం వెలువడిందే గాని, "తలపడే" పేరును మాత్రం పేర్కొనలేదు. సాంకేతికంగా ఎటువంటి ఆధారాలు లేవని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు, బెంగళూరు వారు చెప్పినందువల్ల ఈ వాదనకు బలం తగ్గింది.[3]
శివకర్ బాపూజీ బొంబాయిలోని చీనాబజార్ లో నివసిస్తూ ఉండేవారు. సంస్కృత, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు.[4] సంస్కృతభాషలో అపారమైన పాండిత్యం సంపాదించారు. విజ్ఞాన పరిశోధనలు, ప్రయోగాల పట్ల అమిత ఆసక్తి కలిగి ఉండేవారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో అధ్యాపకులు. వేద వాజ్ఞ్మయమును అవగాహన చేసుకోవడంలో గొప్పవారు.
1913 లో ఈయన స్వయంగా "ప్రాచీన విమాన విద్వేచా శోధ" పేరుతో మరాఠీలో ఒక గ్రంథం రచించారు. భార్య, మిత్రుల సహకారంతో వేద విజ్ఞానంలోని విమాన యంత్ర పరిజ్ఞానాన్ని గ్రహించి విమానాన్ని నిర్మించారు. తాము నిర్మించిన తొలి విమానానికి "మరుత్సఖ" (వాయు మిత్రుడు) అని నామకరణం చేశారు. ఈ పదం భారతీయ దేవత అయిన సరస్వతి చే ఋగ్వేదం (RV 7.96.2) లోవాడబడింది. దీనిని పండిట్ సుబ్బరాయ శాస్త్రి సూచనలతో తయారుచేశారు. దీనిని బొంబాయిలోని ఆర్ట్ సొసైటీ నిర్వహణలో ఉన్న టౌన్ హాల్ లో ప్రదర్శించారు. పాదరసాన్ని, సౌరశక్తిని ఇంధనాలుగా వాడి ఈ విమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపించారు. బొంబాయి సమీప చౌపట్టి సముద్ర తీర ప్రాంతంలో ప్రయోగించిన ఈ విమానం దాదాపు 1500 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించిందని తెలియవస్తుంది. ఈయన నిర్మించిన విమానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అనేక ప్రముఖులు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. కానీ ఆయన కొద్ది కాలానికే అస్వస్థతకు గురై మరణించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన కుటుంబం ఈ విమాన చట్రంలో కూర్చుని విమానంలో వెళ్ళు అనుభూతి పొందుటకు ఉపయోగించారట.[5] ఈయన నిర్మించిన విమానాన్ని ఈయన వారసులు బ్రిటిష్ కంపెనీకి అమ్మివేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాథర్ తిలక్ పూణె నుంచి ప్రచురించిన "కేసరి" వారపత్రిక 1953, మే 10 వ తేదీ సంచికలో ఒక వ్యాసం ప్రచురితమైనది. తలపడే సన్నిహిత మిత్రుడు పండిత దామోదర్ సాత్వలేకర్ ఈ వ్యాసాన్ని రాశారు. తలపడే నిర్మించిన విమానం, ప్రయోగ సంఘటనకు సంబంధించిన వివరాలను ఈ వ్యాసంలో తెలిపారు.[6]
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు పరిశోధనల ప్రకారం యిటువంటి ఎగిరే యంత్రం నిర్మించుట సాధ్యంకాదు.[3] అంతేకాక, అటువంటి ఒక విజయవంతమైన విమాన పరిశోధనలకు ఆధారాల యొక్క సాంకేతిక సాధ్యతపై అత్యంత వివాదాలున్నాయి.శాస్త్రి గారు "విమాన శాస్త్రం" అనే గ్రంథాన్ని 20 వ శతాబ్దంలో సంస్కృతంలో వ్రాశారు. ఈ "మరుత్సఖ" విమానం వేదాలలోని ఈ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని తయారు కాబడింది. ఈ విషయం 1985 లో డి.కె.కంజీలాల్ వ్రాసిన Vimana in Ancient India: Aeroplanes Or Flying Machines in Ancient India గ్రంథంలో సూచించబడినది, మరాఠీ పత్రిక "కేసరి"లో కూడా వ్రాయబడినది[5] ఈ విమానాన్ని స్వయంగా చూసినవారిలో ఆనాటి బరోడా యువరాజు సాయాజీరావ్ గైక్వాడ్, ప్రసిద్ధ న్యాయ శాస్త్రవేత్త మహదేవ గోవింద రానడే, వాణిజ్య ప్రముఖులు సేట్ లాల్జీ నారాయణ్ మొదలగువారు ఉన్నారు[7][8]
ఈయన భార్య శ్రీమతి లక్ష్మీబాయి. ఆయనకు ఇద్దరు పుత్రులు, ఒక పుత్రిక. ఆయన పెద్ద కుమారుడు మోరేశ్వర్ ముంబయిలో పురపాలిక సంఘంలో ఉద్యోగి. చిన్న కుమారుడు బ్యాంక్ ఆఫ్ బాంబేలో ఉద్యోగి. పుత్రిక పేరు నవుబాయి.[9][10]
శివకర్ తలపడే యొక్క ప్రసిద్ధ రచనలు [11]
{{cite book}}
: CS1 maint: extra punctuation (link)
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link)