శివమణి | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | కోన వెంకట్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | పూరీ జగన్నాథ్ |
కథ | పూరీ జగన్నాథ్ |
నిర్మాత | పూరీ జగన్నాథ్ డి.వి.వి. దానయ్య (సమర్పణ) |
తారాగణం | అక్కినేని నాగార్జున రక్షిత అసిన్ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | డి. వి. వి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 23 అక్టోబరు 2003 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శివమణి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. కథలోని కొంత భాగం 1999లో విడుదలైన మెసేజ్ ఇన్ ఎ బాటిల్ చిత్రం నుండి తీసుకోబడింది, ఇది మెసేజ్ ఇన్ ఎ బాటిల్ - నికోలస్ స్పార్క్స్ నవల నుండి ప్రేరణ పొందింది.
శివమణి వైజాగ్ పూర్ణా మార్కెట్ సి. ఐ. చాలా నిజాయితీ గల అధికారి. ప్రజలందరికీ తన ఫోను నెంబరు ఇచ్చి ఏ సమస్య ఉన్నా అతనికి ఫోన్ చేయమని చెబుతాడు. వసంత అనే అమ్మాయి సరదాగా అతనికి ఫోన్ చేస్తుంది. నెమ్మదిగా వసంత అతని ప్రేమలో పడుతుంది.