నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరచవలసిన అంశాల గురించి చర్చపేజీలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
సిద్ధరామేశ్వరుడు | |
---|---|
![]() శివయోగి సిద్ధరామేశ్వరుడు | |
జననం | సోలార్పూర్ |
స్థాపించిన సంస్థ | లింగాయత్ సమాజము |
తత్వం | కర్మయోగము |
సాహిత్య రచనలు | శివతత్త్వము |
తండ్రి | ముద్దన, ముత్తయ్య |
తల్లి | సుగ్గలాదేవి |
సిద్ధరామేశ్వరుడు లేదా సిద్ధేశ్వరుడు లేదా శివయోగి సిద్ధయోగేశ్వరుడు అను పలు నామములతో పిలవబడిన ఈతను కర్ణాటకలోని లింగాయతులు అనుశాఖకు సంబంధించిన అయిదుగురు ముఖ్య గురువులలో ఒకరు. ఈయన బసవ యుగమున అనగా 12వ శతాబ్దమునకు చెందిన కన్నడ ప్రముఖ కవి.[1]ఈయన వ్రాసిన వచనముల సంఖ్య 68,000 అని అతడే తెలిపినాడు.[2]కాని ఇప్పుడు మనకు లభించినవి కొన్నిమాత్రమే.సిద్దరామేశ్వరుని గురుంచి కన్నడ సాహిత్యమున విపులముగా ఉన్నను, తెలుగునందు మాత్రము అంత ఎక్కువుగా కనిపించదు.పాల్కురికి సోమనాధుడు తన బసవపురాణమునందు సిద్ధరాముడు పొన్నలి పురమునకు, శ్రీగిరినుండి మల్లికార్జుని వద్దకు వచ్చి అచట నిలిచి లక్షాతొంభైఆరువేల శివలింగములను స్థాపించి, ఆపురమునకు అభినవ శ్రీగిరిగా ప్రసిద్ధి అగునట్లు చేసెనని, అన్నపానీయములను విడిచి, మహితయోగానంద లీలుడైనాడని తెలిపినాడు.అంతేకాక అతడు బసవేశ్వరుని దర్శించు నుద్దేశ్యముతో కైలాసమునకు పోయి అచట రుద్ర గణాలను ప్రమధగణాలను తానుగాంచిన పరమేశ్వరుని తాను చూచిన విధానమును వర్ణించియున్నాడు.
పూర్వము (12వ శతాబ్దము) శోలాపూర్ లేదా సొన్నిలిపొరమునందు రేవణసిద్ధుడను రాజగురువు ఆనగరమునందు నివసించుచుండెను.అటులనే సత్యసదాచార సంపన్నులగు ముత్తయ్య, సుగ్గలమ్మ అను వృద్ధదంపతులు ఆనగరమునందు నివసించుచుండిరి. ఒకనాడు రేవణసిద్ధుడు పాదచారియై ఆవృద్ధదంపతుల ఇంటికి పోయి, సుగ్గలమ్మ మాత గర్భముపై తన అమృత హస్తమును ఉంచి, నీకు శివాంశ సంభూతుడగు ఒక కొడుకు పొట్టబోవుచున్నాడు ఆతనికి సిద్ధరామయ్య అను పేరుపెట్టమని ఆశీర్వదించినారు. కొంతకాలమునకు వారిరివురనకు ఒక కొడుకు పుట్టగా వారు వారి ఇలవెలుపు ధూళిమారకయ్య అను పేరును పెట్టిరి, కాని వానిని ధూళిమారకయ్య అని పిలిచిన పలుకక సిద్ధరామయ్య అని పిలిచన మేరకే పలికేవాడట.ఎప్పుడూ ముగ్దముగా ఉండేవాడు.సిద్దరామయ్య ప్రతిరోజు తాను తోడిబాలురలతో అడివికి గోవులను కాచుకొనుటకని పోయి, గోవులను బాలురలకు ఇచ్చి, ఏకాంతస్థలమున శివార్చన, శివధ్యానమందు నిమగ్నుడయ్యేవాడు.ఒకనాడు ఆతనికి అడవిలో ఒక బాలుడు కనిపించి, తనపేరు మల్లయ్య అని తాను శ్రీశైలమునందు వచ్చినాని చెప్పి తనకు ఆకలిగా ఉందని ఏదైనా తెమ్మని సిద్ధరామయ్యను అడుగగా, సిద్ధరామయ్య పరుగుపరుగునా ఇంటికి పోయి తల్లికు చెప్పి మరలా తినుబండారములతో అడివికిరాగా అక్కడమల్లయ్య కనిపించలేదు. మల్లయ్యా, మల్లయ్యా అని గట్టిగా అరుచుకుంటు అడివి అంతా తిరుగుచుండగా, అది మహాశివరాత్రి సందర్భమున శ్రీశైలం పోవుచున్న యాత్రికులు విని మాతో నువ్వు వస్తే నీకు మల్లయ్యను చూపిస్తాము అని సిద్ధరామయ్య కు చెప్పగా, తాను చూచిన మల్లయ్యను తప్పకుండా చూచెదనని వారితో శ్రీశైలం ప్రయాణించినాడు. అక్కడ సిద్ధరామయ్య మల్లయ్యను వెతికి వెతికి వేసారి, చివరికి అలా వెతుకుతూ ఉండగా ఒక లోయలో సిద్ధరామయ్య పడిపోయినాడు. అప్పుడు ఆతనిని ఆమల్లయ్య ఏఅపాయము లేకుండా కాపాడినాడట.అప్పుడు మల్లయ్య సిద్ధరామయ్య ధృఢ భక్తికి మెచ్చి ఆయనకు సిద్ధయోగసిద్ధిని ప్రసాదించినాడు.అయినను నీవలన మానవాళికి ఉద్ధారణము కావలనని చెప్పి తన ఊరికి ప్రొమ్మని ఆజ్ఞాపించినాడు.అంత సిద్ధరామయ్య తన ఊరికి పోయి, కొద్దికాలమునకు అచట కపిలసిద్ధ మలికార్జున అను మహాలింగమును ప్రతిష్టించినాడు. అందుకు తన అనుభావ వచనములను "కపిలసిద్ధ మల్లికార్జునా" అనే మకుటములతోనే వర్నించినాడు.అంతర తాను కర్మయోగియై, బాహ్యాడంబరముతో తన యోగ పరమార్ధమును తలంచి ప్రతిచోట లింగములను ప్రతిష్ఠించుచుండేవాడు.
మహాజ్ఞానియు, షట్స్థల చక్రవర్తియును అగు చెన్నబసవేశ్వరుండ, ప్రభువు ఆజ్ఞానుసారము సిద్ధరామయ్యకు లింగ దీక్షాసంస్కారంబు ఒనర్చి లింగాంగ సామరస్యానుచారమును బోధించినాడు.సిద్ధరామయ్య అనుభావ సంపన్నుడై, శివయోగియై అనుభవమంటపమునందు ప్రముఖస్థానమును పొందగలిగెను.తన వచనములతో ఇతరులకు జ్ఞానమును బోధించుచుండెను.కొన్నాళ్లకు కల్యాణగ్రామమునందు చెలరేగిన విప్లవమునకు, రక్తపాతమునకు తన సమ్మతి లేనందున, సిద్ధరామయ్య తన స్వస్థానమునకు తిరిగిపోయినాడు.ఒకనాడు తన దివ్యదృష్టితో తనకు అంత్యకాలము సమీపించినదని తెలుసుకొని తాను నిర్మించిన కొలనునందు సమాధిని నిర్మించుకొని అందులో ప్రవేశించి లింగ నిష్ఠయందు ఉండి నిర్భయలయ్యెనని ఆతని చరిత్ర తెలుపుచున్నది. నేడు సొన్నలి పురమునందు అతని సమాధి స్థానము సిద్ధేశ్వర దేవాల్యము అనుపేరుతో సుప్రసిద్ధ యాత్రస్థలమై ఉన్నది.
సిద్ధరామేశ్వరుడు వచనములనేకాక, అనేక గీతములను, బసవస్తోత్రత్రివిధి, మిశ్రస్తోత్ర త్రివిది, అష్టావర్ణ స్తోత్రత్రివిధి అను ఇతర రచనములను కూడా రచించి విపులమగు సాహిత్యమును సృష్టించియున్నాడని తెలియుచున్నది.