శివలింగ | |
---|---|
దర్శకత్వం | గోపీచంద్ మలినేని |
రచన | వై. వి. ఎస్. చౌదరి |
దీనిపై ఆధారితం | శివలింగ (2016 కన్నడ సినిమా ) |
నిర్మాత | రమేష్ పి.పిళ్లై, మల్కాపురం శివకుమార్ |
తారాగణం | రాఘవ లారెన్స్ రితికా సింగ్ బ్రహ్మానందం భాను ప్రియ ఊర్వశి ప్రదీప్ రావత్ |
ఛాయాగ్రహణం | సర్వేశ్ మురారి |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | ట్రిడెంట్ ఆర్ట్స్ |
పంపిణీదార్లు | అక్రోస్ ఫిలిమ్స్ (తమిళ్), అభిషేక్ ఫిలింస్ (తెలుగు) |
విడుదల తేదీ | 14 ఏప్రిల్ 2017 |
సినిమా నిడివి | 149 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ & తెలుగు |
శివలింగ 2017లో తెలుగులో విడుదలైన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించాడు. రాఘవా లారెన్స్, రితికా సింగ్, ఊర్వశి, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14, 2017న తెలుగు , తమిళ భాషల్లో విడుదలైంది.
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం (శక్తి) కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని సీబీ–సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు కమిషనర్ అప్పజెప్తారు. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ (రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు ? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రహీంను హత్య చేసింది ఎవరు? ఈ కేసును శివలింగేశ్వర్ ఛేదించడా ? లేదా ? అనేది మిగతా సినిమా కథ.[1]