శీలభద్ర ( సంస్కృతం : శీలభద్రః ; ) (529 – 645 [1] ) ఒక బౌద్ధ సన్యాసి, తత్వవేత్త . అతను భారతదేశంలోని నలందా మఠానికి మఠాధిపతిగా, యోగాచార బోధనలలో నిపుణుడిగా, చైనీస్ బౌద్ధ సన్యాసి జువాన్‌జాంగ్ యొక్క వ్యక్తిగత బోధకుడిగా ప్రసిద్ధి చెందాడు.
శీలభద్ర మగధలోని భారతీయ కుటుంబంలో జన్మించాడు. [2] యువకుడిగా అతను పశ్చిమాన నలందాకు వెళ్ళాడు. అక్కడ నలందా యొక్క ధర్మపాలచే శిక్షణ పొందాడు, అతను బౌద్ధ సన్యాసిగా కూడా నియమించబడ్డాడు. [3] జువాన్‌జాంగ్ కథనం ప్రకారం, శీలభద్ర క్రమంగా విదేశాలలో కూడా తన అభ్యాసానికి ప్రసిద్ధి చెందాడు. 30 సంవత్సరాల వయస్సులో, మతపరమైన చర్చలో దక్షిణ భారతదేశానికి చెందిన ఒక బ్రాహ్మణుడిని ఓడించిన తరువాత, రాజు అతనికి ఒక నగర ఆదాయాన్ని ఇవ్వాలని పట్టుబట్టాడు, దానిని శైలభద్ర అయిష్టంగా అంగీకరించాడు. అతను అక్కడ ఒక మఠాన్ని నిర్మించాడు. [3] ఈ మఠం పేరు శిలభద్ర విహారం . [4]
33 సంవత్సరాల వయస్సులో, చైనీస్ బౌద్ధ సన్యాసి జువాన్‌జాంగ్ బౌద్ధమతాన్ని అధ్యయనం చేయడానికి ఇంకా చైనీస్‌లోకి అనువదించడానికి బౌద్ధ గ్రంథాలను సేకరించడానికి భారతదేశానికి ప్రమాదకరమైన ప్రయాణం చేశాడు. [5] జువాన్‌జాంగ్ భారతదేశంలో పదేళ్లపాటు వివిధ బౌద్ధ గురువుల వద్ద ప్రయాణించి చదువుకున్నాడు. [5] ఈ గురువులలో నలందా మఠం యొక్క మఠాధిపతి అయిన శైలభద్ర కూడా ఉన్నారు, ఆయన వయస్సు 106 సంవత్సరాలు. [6] శిలభద్ర ఈ సమయంలో చాలా వృద్ధుడుగా చాలా గౌరవనీయ మఠ గురువుగా వర్ణింపబడినాడు. [7]
జువాన్‌జాంగ్ నలందాలో ఉపాధ్యాయుల సంఖ్య సుమారు 1510 [8] ఉన్నట్లు నమోదు చేసాడు. వీరిలో, సుమారు 1000 మంది 20 సూత్రాలు, శాస్త్రాల సేకరణలను వివరించగలిగేవారని వివరించాడు. [8] వీరిలో కొద్ది మంది మాత్రమే అన్ని సూత్రాలు అధ్యయనం జేయగలిగారని వారిలో మఠాధిపతి శీలభద్రుడు మాత్రమే నలందలోని అన్ని ప్రధాన సూత్రాలు శాస్త్రాల సేకరణలను అధ్యయనం చేశాడు అని వివరించాడు. [8]
జువాన్‌జాంగ్ నలందాలో చాలా సంవత్సరాలు శీలభద్రచే యోగాచార బోధనలలో శిక్షణ పొందాడు. భారతదేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత, జువాన్‌జాంగ్ తనతో పాటు బౌద్ధ గ్రంథాల బండిని తీసుకువచ్చాడు, ఇందులో యోగాచారభూమి-శాస్త్ర వంటి ముఖ్యమైన యోగాచార రచనలు ఉన్నాయి. [9] మొత్తంగా, జువాన్‌జాంగ్ భారతదేశం నుండి 657 బౌద్ధ గ్రంథాలను సేకరించాడు. [5] అతను చైనాకు తిరిగి వచ్చిన తర్వాత, ఈ గ్రంథాలను చైనీస్‌లోకి అనువదించే ఉద్దేశ్యంతో అతనికి ప్రభుత్వ మద్దతు ఇంకా అనేక మంది సహాయకులు అందించారు.
భారతీయ అనువాదకుడు [[Divākara|దివాకర]] ప్రకారం, శీలభద్రుడు సంధినిర్మోచన సూత్రంలో ఇచ్చిన విభజనలను అనుసరించి బౌద్ధ బోధనలను ధర్మ చక్రం యొక్క మూడు మలుపులుగా విభజించాడు: [10]
శీలభద్రుడు బౌద్ధమతం యొక్క అత్యున్నత రూపంగా తన మూడవ సూత్ర (యోగాచార) బోధనలను పరిగణించాడు, ఎందుకంటే ఇది మూడు స్వభావాలను పూర్తిగా వివరిస్తుంది.
శీలభద్రుడు బుద్ధభూమివ్యాఖ్యాన అనే వచనాన్ని రచించాడు, ఇది ఇప్పుడు టిబెటన్ భాషలో మాత్రమే ఉంది. [1]