ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.
శుభలేఖ సుధాకర్ | |
---|---|
జననం | సూరావఝుల సుధాకర్ 1960 నవంబరు 19 |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | ఎస్.పి.శైలజ |
తల్లిదండ్రులు | ఎస్ఎస్ కాంతం, కృష్ణారావు [1] |
శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా, భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[2] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.
సుధాకర్ నవంబరు 19, 1960 న ఎస్.ఎస్. కాంతం, కృష్ణారావు దంపతులకు జన్మించాడు. వీరు ముగ్గురు కొడుకులు. సుధాకర్ వీరిలో పెద్దవాడు. రెండో కొడుకు మురళి. మూడో కొడుకు సాగర్. సుధాకర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజ ను పెళ్ళి చేసుకున్నాడు.