శూలిని రాగముకర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 35 వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్నాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని శైలదేశాక్షి[2] లేదా శైలదేష్[3][4] అని పిలుస్తారు.
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 71 వ మేళకర్త రాగమైన కోసలము రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.