శెట్టిబలిజఅనే కులం ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు చెందినవారు. మీరు బీసీ-బి విభాగానికి చెందుతారు.వీరు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అధికంగా కనిపిస్తారు;[1] ఈ కులాన్ని భారత ప్రభుత్వం వెనుక బడిన కులంగా గుర్తించింది. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించారు. [2][3]
కోస్తా ఆంధ్రలోని శెట్టిబలిజలు (చెట్టు బలిజ, ఈడిగ,అని కూడా పిలుస్తారు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.[4]కోస్తా ఆంధ్రలోని శెట్టిబలిజ సంఘం వెనుకబడిన కులంగా వర్గీకరించబడింది ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాలో BC-B క్రింద జాబితా చేయబడింది.[5]20వ శతాబ్దపు తొలినాళ్లలో, గోదావరి జిల్లాల్లోని కల్లును కొట్టేవారిని వారి వృత్తి తక్కువ ఆర్థిక స్థితి కారణంగా అగ్రవర్ణ ప్రజలు చిన్నచూపు చూసేవారు.[6]25 సెప్టెంబరు 1920న, తూర్పుగోదావరి జిల్లా ( ప్రస్తుతం కోనసీమ జిల్లా ) బోడసకుర్రులో ఈడిగ వర్గానికి చెందిన ధనిక వ్యాపారి దొమ్మేటి వెంకట రెడ్డి (1853–1928) కుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇకపై ఈడిగ కులం నుండి శెట్టిబలిజగా పేరు మార్చుకోవాలని తీర్మానించారు.ఈ కులస్తులకి బలిజ వర్గానికి సంబంధం లేనప్పటికీ గౌరవనీయమైన పేరుగా భావించి వారి కులం పేరుతో 'బలిజ' పదాన్ని చేర్చారు.వెంకటరెడ్డి తన తోటి కులస్తుల భూమి పత్రాలు, జనాభా లెక్కలు, ఇతర ప్రభుత్వ రికార్డులలో వారి కొత్త పేరుతో వారి కులాన్ని నమోదు చేయాలని కోరారు కల్లు కొట్టే కుటుంబాల పేర్లకు -గాడు అనే పదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని తీర్మానం చేసి , జిల్లా కలెక్టర్‌కి ఒక మెమోరాండం సమర్పించారు.దొమ్మేటి వెంకట రెడ్డి ఒక ఉన్నత పాఠశాలను కూడా స్థాపించాడు తన కుల విద్యాభివృద్ధికి ఇతర కార్యక్రమాలను చేపట్టాడు.2020లో, సంఘం సభ్యులు తమ కులం పేరును ఈడిగ నుండి శెట్టిబలిజగా మార్చిన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. [7]నేడు కోనసీమ లో అధికం గా ఉండే శెట్టి బలిజలు ఆధునిక సమాజం లో అనేక కుల వృత్తి ల మీద ఆధారపడి జీవిస్తున్నారు.రాయలసీమలో ఉన్న బలిజ కులానికి కోస్తాంధ్రలో ఉన్న శెట్టిబలిజ కులానికి ఎటువంటి సంబంధం లేదు.
The Idiga or Ediga are toddy-tappers and liquor vendors in the Rayalaseema area. They are referred to as Goundala and Kalali in Telangana and Gowda, Gamalla or Setti Balija in coastal Andhra.
{{cite book}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)