శైలజారెడ్డి అల్లుడు | |
---|---|
దర్శకత్వం | దాసరి మారుతి |
రచన | దాసరి మారుతి |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | నిజార్ షఫి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 13 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
శైలజారెడ్డి అల్లుడు 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ, పిడివి ప్రసాద్ లు నిర్మించారు. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య, అనూ ఇమాన్యుల్, రమ్యకృష్ణ, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చగా, నిజార్ షఫి ఛాయాగ్రహకుడిగా పనిచేశాడు. ఈ చిత్రం 2018 సెప్టెంబరు 13న విడుదలయ్యింది.
చైతన్య (అక్కినేని నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అనూ ఇమాన్యుల్) అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్‌లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్‌మెంట్ కూడా చేసేస్తాడు. కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ.
ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. పాటలని ఆదిత్య మ్యుజిక్ ద్వారా విడుదల చేశారు.[1]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అను బేబీ" | Krishna Kanth (K.K) | అనుదీప్ దేవ్ | 4:20 |
2. | "శైలజారెడ్డి అల్లుడు చూడే" | Kasarla Shyam | మంగ్లీ | 3:15 |
3. | "ఎగిరెగిరే" | Krishna Kanth (K.K) | సిడ్ శ్రీరామ్, లిప్సిక | 3:10 |
4. | "గోల్డు రంగు పిల్ల" | శ్రీ మణి | అనురాగ్ కుళకర్ణి, రమ్య బెహర, మోహన భోగరాజు, యం. హరిప్రియ | 3:43 |
5. | "పెళ్ళి పందిరి" | Sirivennela Seetharama Sastry | విజయ్ యేసుదాస్ | 4:41 |
6. | "తను వెతికిన" | Sirivennela Seetharama Sastry | సత్య యామిని | 4:04 |
మొత్తం నిడివి: | 23:15 |
ఈ చిత్రాన్ని 2018 ఆగష్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి, కానీ కేరళ లో వచ్చిన వరదల కారణంగా 2018 సెప్టెంబరు 13 న విడుదల చేశారు.[2][3]