శోభు యార్లగడ్డ | |
---|---|
జననం | శోభు యార్లగడ్డ 1971 మార్చి 19 |
విద్యాసంస్థ | టెక్సాస్ విశ్వవిద్యాలయం |
వృత్తి | సినీ నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
బంధువులు | కె. రాఘవేంద్రరావు (మామ) కోవెలమూడి ప్రకాష్ (బామ్మరిది) |
శోభు యార్లగడ్డ (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత దేవినేని ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ ద్వారా బాహుబలి, వేదం, మర్యాద రామన్న లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.[1]
శోభు కృష్ణా జిల్లా, గుడివాడ లో 1971, మార్చి 19 న జన్మించాడు. 1992 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. 1995 లో అమెరికాలో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నాడు. ఒకటిన్నర సంవత్సరం పాటు గ్రేటర్ లాస్ ఏంజిలెస్ ఏరియా ఫర్ కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డు సంస్థలో ఎయిర్ రిసోర్స్ ఇంజనీరుగా పనిచేశాడు. ప్రముఖ దర్శకుడైన కె. రాఘవేంద్రరావు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2001 లో ఆర్కా మీడియా వర్క్స్ అనే సంస్థను స్థాపించాడు.
2001లో ఆర్కా మీడియా వర్క్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బంగ్లా, మరాఠీ భాషలో టీవీ కార్యక్రమాలు రూపొందించే సంస్థను స్థాపించాడు. మార్నింగ్ రాగ, అనగనగా ఓ ధీరుడు సినిమాలకు లైన్ ప్రొడ్యూసరుగా, బాబీ, పాండురంగడు సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు.[2]