శ్యామ్ శరణ్ నేగీ | |
---|---|
జననం | [1] కల్పా, కిన్నౌర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ | 1917 జూలై 1
మరణం | 2022 నవంబరు 5 కల్పా, కిన్నౌర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ | (వయసు 105)
విద్యాసంస్థ | హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం పంజాబ్ విశ్వవిద్యాలయం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా |
వృత్తి | ఉపాధ్యాయుడు |
బిరుదు | స్వతంత్ర భారత తొలి ఓటరు |
శ్యామ్ శరణ్ నేగి, (1917 జూలై 1 - 2022 నవంబరు 5)[2] హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పాలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. 1947లో బ్రిటిష్ పాలన ముగింపు తరువాత భారతదేశంలో 1951లో మొదటిసారిగా జరిగిన సాధారణ ఎన్నికలలో మొదటి ఓటు వేసాడు.[3][4]
శ్యామ్ శరణ్ నేగీ 1917 జూలై 1న హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కిన్నౌర్ గ్రామంలో జన్మించాడు.
మొదటి ఎన్నికల పోలింగ్‌లో ఎక్కువ భాగం 1952 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఐదునెలల ముందుగానే ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి-మార్చిలో ప్రతికూల వాతావరణం వల్ల భారీ హిమపాతం కురిసే అవకాశం ఉంటుంది.[5][6] శ్యామ్ శరణ్ నేగి 1951 అక్టోబరులో మొదటి ఓటు వేశాడు.[7] 1951 నుండి మరణించే వరకు ప్రతి సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసాడు. భారతదేశపు మొదటి ఓటరుగా గుర్తించబడ్డాడు.[5][8] 2022 వరకు నేగీ 34 సార్లు తన ఓటుహక్కు వినియోగించుకున్నాడు.[9]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన నేగి 1975లో రిటైరయ్యాడు. 2014 నుంచి మరణించే వరకు రాష్ట్ర ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగాడు. 2010లో, అప్పటి భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ నవీన్ చావ్లా, ఎన్నికల సంఘం వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కల్పా గ్రామాన్ని సందర్శించి నేగిని సత్కరించాడు.[10] 2014లో, గూగుల్ ఇండియా ఒక పబ్లిక్ సర్వీస్ ప్రకటనను రూపొందించింది, దీనిలో నేగి స్వతంత్ర భారతదేశం మొదటి ఎన్నికలలో పాల్గొనడం గురించి చెప్పబడింది, వీక్షకులకు ఓటు ప్రాముఖ్యతను గుర్తు చేసింది.[11]
కొంతకాలంపాటు వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడిన శ్యామ్ శరణ్ నేగి తన 105 ఏళ్ళ వయసులో 2022 నవంబరు 5న మరణించాడు.[12]
సనమ్ రే అనే హిందీ సినిమాలోని ప్రత్యేక పాత్రలో శ్యామ్ శరణ్ నేగి నటించాడు.[13]
{{cite news}}
: CS1 maint: others (link)
{{cite news}}
: CS1 maint: others (link)
{{cite web}}
: |last3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)