శ్రబానీ దేవధర్ | |
---|---|
జననం | [1] కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1962 జూన్ 12
క్రియాశీలక సంవత్సరాలు | 1993 to ప్రస్తుతం |
Notable work(s) | లపాండవ్ (1993) |
భార్య / భర్త | [2][3] |
పిల్లలు | సాయి దేవధర్ (కుమార్తె) |
పురస్కారాలు | "ఉత్తమ మరాఠీ ఫీచర్ ఫిల్మ్"కి జాతీయ చలనచిత్ర అవార్డు |
శ్రబాని దేవధర్ భారతీయ సినిమా దర్శకురాలు. స్క్రీన్ ప్లే రచయిత్రి. తన మొదటి ప్రాజెక్ట్, 1993లో తీసిన లపాండవ్ సినిమా భారత జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3][4] [5]
దేధార్ ఫిల్మ్‌మేకర్‌గా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు.[2] ఈమె తల్లితండ్రులు ఇద్దరూ డాక్టర్లు, తన సినిమానిర్మాణ పరిజ్ఞానం తన భర్త, సినిమాటోగ్రాఫర్ దేబు దేవ్ధర్ నుండి వచ్చిందని ఆమె అంగీకరించింది. పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ మేకర్ కావాలనే తన కోరికను కొనసాగించేందుకు ఫిలిం అప్రిసియేషన్ కోర్సులు తీసుకోవాలని ఈమెను ప్రోత్సహించాడు. సతా లోటా పాన్ సగ్లా ఖోటాను రూపొందించడానికి ముందు మొదటి సినిమాలో, ప్రతి ప్రాజెక్ట్‌లో ఆమెతో కలిసి పనిచేశాడు.[3]
రచయిత/నిర్మాత సోనాలి బంగేరా కోసం దేధార్ రాబోయే షుగర్, సాల్ట్ అని ప్రేమ్‌కి దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ ఆమె వ్యక్తిగత సమస్యల కారణంగా ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నప్పుడు, బంగేరా స్వయంగా చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు.[6] సతా లోటా పాన్ సగ్లా ఖోటా పనిని పూర్తి చేసింది, ఇది 2014 నవంబరులో విడుదలయింది. దేవధర్ స్టార్ ప్రవా[7] కి సృజనాత్మక దర్శకుడు, 14వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల జ్యూరీలో ఉన్నది.[8] హిందీ, బెంగాలీ రెండు భాషల్లోనూ అదనపు సినిమాలు చేసే ఆలోచనలో ఉంది.[3]
<ref>
ట్యాగు; "Box Office India" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు