శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అనేది తెలుగు సినిమాను నిర్మించే, పంపిణీచేసే నిర్మాణ సంస్థ. తెలుగు సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ 2003లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. 2012లో, నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దేవుడు చేసిన మనుషులు[1] సినిమాను నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర భాగస్వాములు ప్రసాద్, భోగవల్లి బాపినీడు.
2003లో రవితేజ, సంగీత, వాణి నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఈ సంస్థ ప్రారంభించబడింది. ఒక సంవత్సరం తర్వాత ఈ సంస్థ తెలుగు సినిమారంగంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌లలో ఒకటైన ఛత్రపతి సినిమాను నిర్మించింది. దీనికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రభాస్, శ్రియ శరణ్ నటించారు. ఎల్లప్పుడూ కొత్త స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం ద్వారా ఈ సంస్థ ప్రజాదరణ పొందింది.
ఈ సంస్థ స్వయంగా నిర్మించిన ఛత్రపతి సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెట్టింది. 2011లో ఊసరవెల్లి సినిమాను, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా పంపిణీ చేసింది.
సంవత్సరం
|
సినిమా
|
నటీనటులు
|
దర్శకుడు
|
ఇతర వివరాలు
|
1986
|
డ్రైవర్ బాబు
|
శోభన్ బాబు, రాధ
|
బోయిన సుబ్బారావు
|
|
1987
|
మకుటం లేని మహారాజు
|
కృష్ణ, శ్రీదేవి
|
కె.బాపయ్య
|
|
1988
|
చట్టంతో చదరంగం
|
శోభన్ బాబు, అర్జున్ సర్జా, శారద
|
కె.మురళీమోహనరావు
|
|
1989
|
ఒంటరి పోరాటం
|
దగ్గుబాటి వెంకటేష్, మంచు మోహన్ బాబు, జయసుధ, కన్నెగంటి బ్రహ్మానందం
|
కె. రాఘవేంద్రరావు
|
|
1990
|
దాగుడు మూతల దాంపంత్యం
|
అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ
|
రేలంగి నరసింహారావు
|
|
1996
|
అదిరింది అల్లుడు
|
మంచు మోహన్ బాబు, రమ్యకృష్ణ
|
ఇ.వి.వి.సత్యనారాయణ
|
|
2003
|
ఈ అబ్బాయి చాలా మంచోడు
|
రవితేజ, సంగీత, వాణి
|
అగస్త్యన్
|
|
2005
|
ఛత్రపతి
|
ప్రభాస్, శ్రియా సరన్
|
ఎస్. ఎస్. రాజమౌళి
|
|
2006
|
ఖతర్నాక్
|
రవితేజ, ఇలియానా
|
అమ్మ రాజశేఖర్
|
|
2009
|
ఆర్య 2
|
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్
|
సుకుమార్
|
|
2010
|
డార్లింగ్
|
ప్రభాస్, కాజల్ అగర్వాల్
|
ఎ. కరుణాకరన్
|
|
2011
|
ఊసరవెల్లి
|
జూనియర్ ఎన్.టి.ఆర్, తమన్నా
|
సురేందర్ రెడ్డి
|
|
2012
|
దేవుడు చేసిన మనుషులు
|
రవితేజ, ఇలియానా
|
పూరీ జగన్నాథ్
|
|
2013
|
ఒంగోలు గిత్త
|
రామ్ పోతినేని, కృతి కర్బంద
|
భాస్కర్
|
|
2013
|
సాహసం
|
తొట్టెంపూడి గోపీచంద్, తాప్సీ
|
చంద్రశేఖర్ యేలేటి
|
|
2013
|
అత్తారింటికి దారేది
|
పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత సుభాష్
|
త్రివిక్రమ్ శ్రీనివాస్
|
సైమా ఉత్తమ చిత్రం - తెలుగు
|
2015
|
దోచేయ్
|
అక్కినేని నాగ చైతన్య, కృతి సనన్
|
సుధీర్ వర్మ
|
|
2016
|
నాన్నకు ప్రేమతో
|
జూనియర్ ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్
|
సుకుమార్
|
|
2016
|
ఇంట్లో దెయ్యం నాకేం భయం
|
అల్లరి నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్
|
జి. నాగేశ్వరరెడ్డి
|
|
2017
|
రాధ
|
శర్వానంద్, లావణ్య త్రిపాఠి
|
చంద్రమోహన్
|
|
2018
|
తొలిప్రేమ
|
వరుణ్ తేజ్, రాశి ఖన్నా
|
వెంకీ అట్లూరి
|
|
2019
|
మిస్టర్ మజ్ను
|
అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్
|
వెంకీ అట్లూరి
|
|
2020
|
సోలో బ్రతుకే సో బెటర్
|
సాయి ధరమ్ తేజ్, నభా నటేష్
|
సుబ్బు
|
[2]
|
2021
|
నిన్నిలా నిన్నిలా
|
నిత్య మేనన్, అశోక్ సెల్వన్, రీతు వర్మ
|
అని శశి
|
[3]
|
2022
|
భామా కలాపం
|
ప్రియమణి
|
అభిమన్యు తాడిమేటి
|
|
2022
|
రంగ రంగ వైభవంగా
|
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ
|
గిరీశాయ
|
|