శ్రీకాంత్ కుమార్ జెనా (జననం 18 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ఆ తరువాత కటక్, బాలాసోర్, కేంద్రపారా నియోజకవర్గాల నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై గుజ్రాల్, దేవెగౌడ, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాలలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]