వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | చెన్నై, తమిళనాడు | 1976 ఫిబ్రవరి 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 129) | 2000 మార్చి 19 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2004 డిసెంబరు 26 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–2005/06 | తమిళనాడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07 | మహారాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10 | గోవా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 | అస్సాం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | హిమాచల్ ప్రదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఆగస్టు 19 |
శ్రీధరన్ శ్రీరామ్, తమిళనాడుకు చెందిన భారతీయ మాజీ క్రికెటర్, కోచ్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఇండియన్ క్రికెట్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో ఆడాడు. 2022, ఆగస్టు 19న టీ20 ప్రపంచ కప్ 2022 వరకు బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు సాంకేతిక సలహాదారుగా నియమించబడ్డాడు.
శ్రీధరన్ శ్రీరామ్ 1976, ఫిబ్రవరి 21న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు.
ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా శ్రీరామ్ తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. 1992-93 సీజన్‌లో భారతదేశం అండర్-19 దక్షిణాఫ్రికా పర్యటనలో 29 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు తరపున ఆడుతున్నప్పుడు తన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సీజన్ 1999-2000లో రంజీ ట్రోఫీలో 5 సెంచరీలతోసహా 1075 పరుగులు చేశాడు. భారత క్రికెట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు.[1]
దేశీయ క్రికెట్ లో మంచి ఆటతీరును కనబరచిన శ్రీరామ్ కు భారత జాతీయ క్రికెట్ జట్టు నుండి పిలుపు వచ్చింది. 2000, మార్చి 19న నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేశాడు. తక్కువ స్కోర్ల వరుస కారణంగా 6 మ్యాచ్‌ల తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.
ఆ తరువాత తమిళనాడు తరపున దేశీయ క్రికెట్‌లో భారీ స్కోరును కొనసాగించాడు. 2004-05లో బంగ్లాదేశ్ పర్యటన కోసం జాతీయ జట్టుతో రెండవ అవకాశాన్ని పొందాడు. మొదటి 2 వన్డేలలో ఆడాడు, మొదటి వన్డేలో 3 వికెట్లు తీశాడు. రెండవ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారతదేశం ఓడిపోయింది. భారత్ జట్టకు ఇదే అతని చివరి మ్యాచ్.
2006లో తమిళనాడు నుంచి మహారాష్ట్రకు వెళ్ళాడు. 2004లో ఇంగ్లీష్ డొమెస్టిక్ క్రికెట్‌లో స్కాటిష్ సాల్టియర్స్ తరఫున ఓవర్సీస్ ప్లేయర్‌గా కూడా ఆడాడు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు క్రమం తప్పకుండా ఎంపికయ్యాడు. ప్రస్తుతం గోవా తరపున ఆడుతున్నాడు.
2007లో శ్రీరామ్ ఇండియన్ క్రికెట్ లీగ్‌తో సంతకం చేయాలని నిర్ణయించుకున్నాడు.[2] 2009లో ఇండియన్ క్రికెట్ లీగ్ నుండి వైదొలిగినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక కోసం తిరిగి గణనలోకి రావడానికి బిసిసిఐ నుండి క్షమాభిక్ష ప్రతిపాదనను అంగీకరించాడు.
2015లో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ఎ జట్టుతో కలిసి పనిచేశాడు. 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోచింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఎంపికయ్యాడు. 2019 యాషెస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో కూడా ఉన్నాడు.[3]
2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[4] 2018లో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియాకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు. 2022, ఆగస్టు 19న అంతర్జాతీయ టీ20ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌కు సాంకేతిక సలహాదారుగా నిర్ధారించబడ్డాడు.[5]