![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీను పాండ్రంకి | |
---|---|
![]() | |
జననం | శ్రీను పాండ్రంకి 5 అక్టోబరు 1987 |
వృత్తి | సినీ దర్శకుడు, రచయిత |
శ్రీను పాండ్రంకి నవలా రచయిత, సినీ దర్శకుడు. అతడు ఇంగ్లీష్ లో క్రైమ్ మిస్టరీ నవల X² రాయగా తెలుగులో కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా నవల నిజంగా నేనేనా రాశారు. ఆయన ఇప్పటి వరకు ముప్పైకి పైగా లఘు చిత్రాలు దర్శకత్వం వహించారు. చాలా చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయ్యాయి, అవార్డ్స్ గెలుచుకున్నాయి.[1] [2]
శ్రీను పాండ్రంకి విజయనగరం లో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. సినిమాల మీద ఆశక్తితో ఆయన ఇరవై ఏళ్ళ ప్రాయంలో హైదరాబాద్ పయనమయ్యారు. అసిస్టెంట్ గా ఎక్కడా అవకాశం రాకపోవడంతో సొంతంగా నేర్చుకోవాలన్న అభిలాశతో లఘుచిత్రాలు తీయడం ప్రారంభించారు.
శ్రీను పాండ్రంకి 2007 లో తీసిన మొదటి రెండు లఘు చిత్రాల్లో ఒక దానికి అంతర్జాతీయ పురస్కారం రాగా, మరొకటి మాటీవీ వారు నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కి ఎంపిక అయ్యింది. ప్రతీ లఘు చిత్రం వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడం ఆయన శైలి. మొదట్లో సందేశాత్మక చిత్రాలు మాత్రమే తీసిన అతను తర్వాత కాలం లో ప్రయోగాత్మక చిత్రాలపై మొగ్గు చూపారు. తన అవర్ గ్లాస్ చిత్రం ప్రపంచంలొనే మొట్టమొదటి పాలిన్ డ్రోమ్ చిత్రం. మన తెలుగు 'వికటికవి' లా ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించడం ఆ చిత్రం యొక్క విశేషం. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు ఆయన చిత్రాల్లో చేశారు.
ఆయన దర్శకత్వం వహించిన పీకాబూ, స్టెల్లా చిత్రాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాగా లక్ష్మీ మంచు తో నిర్మించిన డెసిషన్ షార్ట్ ఫిల్మ్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.
ఆయన రచించిన ఇంగ్లీష్ నవల X² ను దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆవిష్కరించారు.[3][4][5][6]
సంవత్సరం | శీర్షిక | నిర్మాణం | భాష |
---|---|---|---|
2007 | లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ | శ్రీను పాండ్రంకి | తెలుగు |
2007 | ఫ్లాట్ నంబర్ 101 | శ్రీను పాండ్రంకి | తెలుగు |
2008 | ఆర్ట్ ఆఫ్ లివింగ్ | మునీంద్ర | తెలుగు |
2009 | బ్రేక్ ద సైలెన్స్ | మునీంద్ర | తెలుగు |
2010 | పింక్ స్లిప్ | అంజన్ & రాం కిరణ్ | తెలుగు |
2011 | ఆర్చిడ్స్ | మురళి | తెలుగు |
2013 | అవర్ గ్లాస్ | శ్రీను పాండ్రంకి | నిశ్శబ్ద చిత్రం |
2014 | లవ్ ఫరెవర్ | భోగాపురపు మధు & పార్వతి | తెలుగు |
2014 | ఏడ్యు ఆర్కుట్ | భాను కూరేళ్ల | ఇంగ్లీష్ |
2015 | ఉప్మా తినేసింది | ప్రణీత్ పాలేటి | తెలుగు |
2015 | అన్ స్పోకెన్ | ప్రణీత్ పాలేటి | నిశ్శబ్ద చిత్రం |
2015 | సూడో సైడ్ | ప్రణీత్ పాలేటి | తెలుగు |
2015 | ఎం.ఎం.ఎస్ | ప్రణీత్ పాలేటి | తెలుగు |
2016 | హ్యాపీ ఆక్సిడెంట్స్ | వెంకట్ బొమ్మినేని | తెలుగు |
2016 | బూచి | ప్రణీత్ పాలేటి & చైతన్య | తెలుగు |
2017 | మెగా ఫ్యాన్ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ | తెలుగు |
2017 | స్టెల్లా | సుధ భీమిరెడ్డి | తెలుగు |
2017 | డెసిషన్ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ | ఇంగ్లీష్ |
2018 | గుడిలో పువ్వు | జీడిగుంట రామలక్ష్మి | తెలుగు |
2018 | డ్రీమ్ రీడర్ | నిర్మలా దేవి | తెలుగు |
2018 | మదర్ లాండ్ | జె డి చెరుకూరి | తెలుగు |
2019 | అన్ యూజువల్ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ | ఇంగ్లీష్ & తెలుగు |