పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య (1911 సెప్టెంబరు 20 - 1990 జూన్ 2) భారతీయ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.[1][2] ఆయన ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ అనే సంస్థని స్థాపించాడు.[3] ఇందులో 150 మిలియన్ సభ్యులే కాక ప్రపంచవ్యాప్తంగా 5000 కేంద్రాలు ఉన్నాయి. దానికి అదనంగా దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ కూడా ఉంది.[4][5][6] ఆయన గాయత్రీ మంత్రం ప్రాముఖ్యతను ప్రచారంలోకి తెచ్చాడు.[7] అలాగే ఆయన మూడు వేల నాలుగు వందల కంటే ఎక్కువ బుక్‌లెట్ల రచయిత.[8][9] ఆయన మొత్తం వేద గ్రంథాల వ్యాఖ్యాత – వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. ఆయన శాస్త్రీయ ఆధ్యాత్మికతకు మార్గదర్శకుడు.
యుగ్ నిర్మాణ్ యోజన అనే అంతర్జాతీయ సామాజిక సంస్కరణ ఉద్యమం భగవతీ దేవి శర్మతో కలసి శ్రీరామ్ శర్మ స్థాపించాడు.[10][11][12][13] ఇది ప్రపంచ సాంస్కృతిక, ఆధ్యాత్మిక శుద్ధీకరణ, మేధో పునర్నిర్మాణం కోసం ప్రారంభించబడింది.[14][15] ఈ ఉద్యమం ప్రస్తుతం 87 దేశాల్లో,[16] భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో కూడా నడుస్తోంది.[17][18]
శాంతికుంజ్ హరిద్వార్‌లోని మతపరమైన పర్యాటక ఆకర్షణ మాత్రమేకాదు[19][20] ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.[21] శాంతికుంజ్‌ను 1971లో భగవతి దేవి శర్మతో కలసి శ్రీరామ్ శర్మ చిన్నగా స్థాపించాడు.[22][23] దీనిని గాయత్రీ నగర్ పేరు మీదుగా విస్తరించారు.
శాంతికుంజ్, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ రెండూ శైలబాలా పాండ్య నేతృత్వంలోని శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్ట్ క్రింద పనిచేస్తాయి.[24]
శ్రీరామ్ శర్మ 1911 సెప్టెంబరు 20న ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జన్మించాడు.[27] సమాజాభివృద్ధి, అభ్యున్నతికి ఆయన అవిరల కృషి సల్పాడు.[28] ఆయన 78 యేళ్ల వయసులో 1990 జూన్ 2న తుదిశ్వాస విడిచాడు.[29][30] ఆయన మరణ తేదీ సందర్భంగా గాయత్రీ జయంతి, మహానిర్వాణ దివస్‌లను కలిసి జరుపుకుంటారు.[31] ఆయన సర్వేశ్వరానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు.[32]