![]() ధృవీకరించబడిన కేసుల మ్యాప్ | |
వ్యాధి | కోవిడ్-19 |
---|---|
ప్రదేశం | శ్రీలంక |
మొదటి కేసు | కోలంబో |
మూల స్థానం | వూహన్చై, చైనా, |
కేసులు నిర్ధారించబడింది | 507,330 [1][2] |
బాగైనవారు | 429,776 [1] |
క్రియాశీలక బాధితులు | 60,906 [1] |
మరణాలు | 12,284 [1] |
అధికార వెబ్‌సైట్ | |
శ్రీలంకలో కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతుంది. మొదటి కేసు 2020 జనవరి 27 న నినిర్ధారించబడింది. 2021 సెప్టెంబరు 1 నాటికి, దేశంలో మొత్తం 462,767 కేసులు నమోదయ్యాయి.386,509 మంది రోగులు వ్యాధి నుండి కోలుకున్నారు.10,140 మంది రోగులు మరణించారు.[3][4][5][6][7]
మొదటి వెవ్ లో శ్రీలంక విజయవంతం ఎదుర్కొంది.రెండవ, మూడవ దశలో ప్రభుత్వం వైఫల్యం అయినది.2020 నవంబరు నుండి కోవిడ్-19 మరణాలలో పెరుగుదలకు కారణమైంది. 2021 ఏప్రిల్లో సింహళ, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా పరిమితుల సడలింపు తర్వాత కేసులు ఎక్కువ నమోదైనవి. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో గణనీయమైన మరణాల ఎక్కువా సంఖ్యలో నమోదయ్యాయి.లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడంతో, కేసులు, మరణాల పెరుగుదలకు దోహదం చేశాయి.
2021 ఆగస్టు 20న, కేసుల వ్యాప్తిని అరికట్టడానికి పది రోజుల లాక్‌డౌన్ విధించింది.[8][9].[10][11][12][13][14][15][16][17][18]
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్"గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.[19][20][21][22][23]
జనవరి 27కి ముందు, శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిబ్బందిని ప్రయాణికులను పరీక్షించమని ఆదేశించింది.జనవరి 27న, చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 44 ఏళ్ల చైనా మహిళకు వైరస్ మొదటి కేసు నమోదైంది.కోవిడ్-19 మొదటి కేసును అనుసరించి, దేశంలో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది.మాస్క్‌లకు కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది.మార్చి మొదటి వారం నుండి, ఇటలీ, ఇరాన్ నుండి వచ్చే సందర్శకులు రెండు వారాల క్వారంటైన్ ఉండాలని నిబంధనలు జారీ చేసింది. మార్చి 12న, మరొక శ్రీలంక పౌరుడు కోవిడ్ -19కి పాజిటివ్ వచ్చింది.మే 30న, 62 మంది వ్యక్తులు కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించారు దీనితో మొత్తం కేసులు 1620కి చేరుకున్నాయి.
మొదటి దశలో, ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం ప్రారంభించింది.
రెండవ దశలో, ప్రభుత్వం 2021 ఫిబ్రవరి చివరిలో 30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయడం ప్రారంభించింది. ఏప్రిల్ నాటికి, 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడం ప్రారంభించబడింది
ఏప్రిల్ నాటికి, మూడవ వేవ్ ఇన్ఫెక్షన్‌లలో COVID కేసులు పెరగడంతో, భారతదేశం ఎగుమతి నిషేధం కారణంగా శ్రీలంక ఆస్ట్రా-జెనెకా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కొంది.రష్యాలో కేసుల పెరుగుదల కారణంగా శ్రీలంక స్పుత్నిక్ V వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంది.
30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయడం పూర్తవడంతో, 18, 30 ఏళ్ల మధ్య ఉన్న ప్రత్యేక కేటగిరీల పరిధిలోకి రాని వారికి టీకాలు వేయడం 2021 సెప్టెంబరు ప్రారంభంలో ప్రారంభించబడింది
{{cite news}}
: CS1 maint: others (link)