ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్వేతా బచ్చన్ నందా | |
---|---|
జననం | శ్వేతా బచ్చన్ 1974 మార్చి 17 |
వృత్తి | సీఎన్‍ఎన్ ఐబీఎన్ లో సిటిజెన్ జర్నలిస్టు సామాజిక కార్యకర్త |
జీవిత భాగస్వామి | నిఖిల్ నందా |
పిల్లలు | నవ్య నవేలి నందా అగత్స్య నందా |
తల్లిదండ్రులు | అమితాబ్ బచ్చన్ , జయ బచ్చన్ |
బంధువులు | అభిషేక్ బచ్చన్ (సోదరుడు) |
శ్వేతనంద (జన్మ నామం : శ్వేతా బచ్చన్) సీఎన్‍ఎన్ ఐబీఎన్ లో సిటిజెన్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కూతురు.
ఈమె ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ ల కూతురు. ఈమె మార్చి 17, 1974 న ముంబైలో పుట్టింది. ఆమె సీఎన్‍ఎన్ ఐబీఎన్ లో సిటిజెన్ జర్నలిస్టుగా పనిచేసింది. ఆమె "నిఖిల్ నందా"ను వివాహం చేసుకుంది. ఆయన "ఎస్కార్ట్స్ గ్రూపు కు ఎగ్జిక్యూటివ్ డైరక్టరు"గా ఉంది. ఈమె వివాహం ఫిబ్రవరి 16 1997లో జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె (నవ్య నవేలి నందా), ఒక కుమారుడు (అగత్స్య నందా) ఉన్నారు.
2007లో ఎన్డీటీవీ ప్రాఫిట్ చానల్ కోసం నెక్స్ట్‍జెన్ అనే ప్రాయోజిత కార్యక్రమం ద్వారా పలు మందిని ఇంటర్వ్యూ తీసుకుంది. ఈమె విద్యాభ్యాసమంతా స్విజర్లాండ్ లో జరిగింది. అమితాబ్ కుటుంబంలో ప్రతిభాశాలియైన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఈమె 2007 లో జయ బచ్చన్తో కలసి మొదటిసారి "కొఫీ" ఎపిసోడ్ లో దర్శనమిచ్చింది. ఈమె దానిలో హేమమాలిని, ఆమె కుమాత్రె ఈషా డియోల్ తో పాటుగా ఈ ఎపిసోడ్ లో కనిపించింది. ఈమె 2006 లో మొదటిసారి ఎల్.అఫిషియల్ ఇండియాలో మోడలింగ్ చేసింది. ఈమె జూన్ 2009 లో ఎల్.అఫిషియల్ ఇండియా యొక్క 7వ వార్షికోత్సవంలో ఆమె సోదరుడు అభిషేక్ బచ్చన్తో పాటు పాల్గొన్నది. ఆమె "ఎయిడ్స్" అవగాహనా కార్యక్రమాలలో ఆమె తల్లిదండ్రులు, సోదరునితోపాటు పాల్గొన్నది. ఈ షో భారీ విజయం సాధించింది.