శ్వేత శ్రీవాత్సవ్ | |
---|---|
![]() 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఈవెంట్లో శ్వేత శ్రీవాత్సవ్ | |
జననం | శ్వేత ఎస్ కర్ణాటక, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
అమిత్ శ్రీవాత్సవ్ (m. 2015) |
పిల్లలు | ఆష్మిత (కుమార్తె) |
శ్వేత శ్రీవాత్సవ్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించి పేరుగాంచింది. దీనికి ముందు ఆమె థియేటర్ ఆర్టిస్ట్. ఆమె టి. ఎన్. సీతారాం మన్వంతరలో తన పాత్రకు గుర్తింపు పొందింది.
ముఖా ముఖి (2006)తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె సింపుల్ అగి ఓంద్ లవ్ స్టోరీ (2013)లో తన నటనతో ఖ్యాతిని పొందింది. ఫెయిర్ & లవ్లీ (2014)లో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు లభించింది.
ఆమె తండ్రి ఎల్.కృష్ణప్ప థియేటర్ ఆర్టిస్ట్. ఆమె బెంగుళూరులోని విజయనగర్‌లో న్యూ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ స్కూల్లో పాఠశాల విద్యను ప్రారంభించి విద్యా పీట్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది. క్రైస్ట్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్, సెంట్రల్ కాలేజీ నుండి మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీని ఆమె పొందింది.[1][2]
ఆమె ఆరో తరగతి చదువుతున్నప్పుడు 1997లో బి. వి. కారంత్ నిర్వహించిన థియేటర్ వర్క్‌షాప్‌లో పాల్గొంది. ఆమె తర్వాత టి. ఎన్. సీతారామ్ దర్శకత్వం వహించిన టెలివిజన్ సోప్ జ్వాలాముఖిలో నటించింది. సీతారామ్స్ మన్వంతరలో నటించడానికి ముందు ఆమె అనేక టెలిఫిల్మ్‌లు, టెలిప్లేలలో నటించింది.[3]
నాటకాలు, టెలివిజన్ ప్రాజెక్ట్‌ల హోస్ట్‌గా చేస్తూనే ఆమె సమాంతర సినిమా ముఖా ముఖి (2006)తో సినిమారంగంలో అడుగుపెట్టింది.[4] సైబర్ యుగదోల్ నవ యువ మధుర ప్రేమ కావ్యం (2012), ఆ దినగాలు (2007)లలో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది. ఆ తరువాత, ఆమె బ్లాక్‌బస్టర్ చిత్రం సింపుల్ అగి ఓంద్ లవ్ స్టోరీ (2013)లో నటించింది. ఇది బబ్లీ గర్ల్ క్యారెక్టర్, ఆమె డైలాగ్ డెలివరీకి విస్తృత ప్రశంసలను పొందింది.
ఆమె 2014 చిత్రం ఫెయిర్ & లవ్లీలో నటించింది, ఇందులో ఆమె ప్రేమ్ సరసన సెక్స్ వర్కర్ పాత్రను పోషించింది, ఈ పాత్రకు ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - కన్నడను గెలుచుకుంది.
ఆమె బొమ్మల రామారం అనే తెలుగు సినిమాలో నటించింది. ఆమె 2016లో వచ్చిన కిరగూరున గయ్యాళిగలు చిత్రంలో నటించింది, అదే పేరుతో ప్రసిద్ధ రచయిత పూర్ణచంద్ర తేజస్వి రాసిన నవల ఆధారంగా సుమన కిత్తూరు దర్శకత్వం వహించాడు.[5] ఆమె అంతర్జాతీయ ఫ్యాషన్ కంపెనీ షినాయెలే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.
మూడు సంవత్సరాల ప్రసూతి విరామం[6] తీసుకున్న తరువాత 2019లో ఆమె రాహదారి సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. గిరీష్ వైరముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె పోలీసు పాత్రలో నటించింది.[7][8]
లక్ష్మీ కటాక్ష అనే టెలిఫిల్మ్ మేకింగ్ సమయంలో పరిచయం అయిన అమిత్ శ్రీవాత్సవ్‌ను 2015లో ఆమె వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఆష్మిత ఉంది.[9][10]
Film | Award | Category | Result |
---|---|---|---|
సైబర్ యుగదోల్ నవ యువ మధుర ప్రేమ కావ్యం | 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ మహిళా అరంగేట్రం | విజేత[11] |
ఆర్యభట్ట ప్రశస్తి | ఉత్తమ తొలి నటి | విజేత | |
సింపుల్ అగి ఓంధ్ లవ్ స్టోరీ | 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | నామినేట్ చేయబడింది |
ఫెయిర్ & లవ్లీ | 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | విజేత[12] |
కిరగూరున గయ్యాళిగలు | 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | నామినేట్ చేయబడింది |