వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
జనన తేదీ | 1956 జనవరి 26 | ||
జనన ప్రదేశం | హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, భారతదేశం | ||
ఆడే స్థానం | స్ట్రైకర్ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
–1972 | హైదరాబాద్ ఆర్సెనల్ క్లబ్ | ||
1972 | టాటా స్పోర్ట్స్ హైదరాబాద్ | ||
1978–1979 | కింగ్‌ఫిషర్ ఈస్ట్ బెంగాల్ | (35) | |
1973–1984 | మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా) | ||
1984–1985 | విక్టోరియా స్పోర్టింగ్ ఢాకా | ||
జాతీయ జట్టు | |||
1974–1984 | భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు | 66 | (23[1]) |
Teams managed | |||
1985–1992 | మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా) | ||
1992–1993 | రాజస్థాన్ క్లబ్ | ||
1993–1995 | పీర్‌లెస్ ఎస్.సి | ||
1997–2000 | సల్గోకర్ ఎస్.సి | ||
2000–2001 | మహీంద్రా యునైటెడ్ | ||
2004 | చర్చిల్ బ్రదర్స్ ఎస్.సి. | ||
2005 | సల్గోకర్ ఎస్.సి | ||
2007–2010 | మహమ్మదీయ స్పోర్టింగ్ క్లబ్ (కోల్‌కతా) | ||
2011–ప్రస్తుతం | సదరన్ సమితి | ||
|
షబ్బీర్ అలీ (జననం 1956 జనవరి 26) (ఆంగ్లం: Shabbir Ali) ఒక భారతీయ ఫుట్‌బాల్ మేనేజర్. మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు.[2] భారతీయ క్రీడలలో అత్యున్నత పురస్కారం అయిన ధ్యాన్ చంద్ అవార్డుతో షబ్బీర్ అలీని 2011లో భారత ప్రభుత్వం సత్కరించింది.[3][4] ధ్యాన్ చంద్ అవార్డుకు ఎంపికైన మొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు అవడం విశేషం.[5]
1956 జనవరి 26న హైదరాబాదులో జన్మించిన షబ్బీర్ అలీ 1970, 1980లలో భారతదేశంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[6] అతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్ట్రైకర్ గా గొప్ప గోల్ స్కోరర్. షబ్బీర్ అలీ చిన్న వయస్సులోనే 1974లో ఇరాన్‌తో సంయుక్తంగా బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి నాయకత్వం వహించి కీర్తిప్రతిష్ఠలు సంపాదించాడు. అతనిని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశంసించడం గమనార్హం.[7]
కొన్ని సంవత్సరాలు బొంబాయిలోని టాటా స్పోర్ట్స్ క్లబ్‌తో ఆడిన తర్వాత, షబ్బీర్ అలీని 1970ల చివరలో అగ్రశ్రేణి కలకత్తా క్లబ్, ఈస్ట్ బెంగాల్ ఆకర్షించింది. తరువాత అతను మొహమ్మదీన్ స్పోర్టింగ్‌లో చేరాడు. 1980ల మధ్యలో ఆ క్లబ్ కు గొప్ప పేరుతెచ్చిపెట్టి షబ్బీర్ అలీ పదవీ విరమణ చేసాడు.[8][9]
షబ్బీర్ అలీ భారతదేశ జాతీయ జట్టుకు 1972, 1984ల మధ్య 13 సంవత్సరాల పాటు సేవలందించాడు. ఆ సమయంలో ఆసియా యూత్, ఆసియా క్రీడలు, ప్రీ-ఒలింపిక్స్, ఆసియా కప్, మెర్డెకా కప్ టోర్నమెంట్, నెహ్రూ గోల్డ్ కప్, కింగ్స్ కప్ లాంటి ఎన్నో టీర్నీల్లో పాల్లొన్నారు. అతను ఆసియా యూత్, ప్రీ-ఒలింపిక్స్, నెహ్రూ కప్, మెర్డెకా, కింగ్స్ కప్ టోర్నమెంట్లలో భారతదేశానికి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలలో ఒకటి 1976లో కౌలాలంపూర్‌లో జరిగిన మెర్డెకా అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్, అందులో మొదటి 35 నిమిషాల్లోనే ఇండోనేషియాపై హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ సాధించిన భారతీయులలో షబ్బీర్ అలీ సాధించిన హ్యాట్రిక్ అత్యంత వేగవంతమైనది.[10][11][12]
అతను భారతదేశం తరపున 72 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1972 నుండి 1984 వరకు తన కెరీర్లో 23 గోల్స్ చేశాడు. ఒక్కో మ్యాచ్‌కు స్ట్రైక్ రేట్ ఆధారంగా అత్యధిక ర్యాంక్ గోల్ స్కోరర్‌లలో షబ్బీర్ అలీ ఒకడు.[13]
2021 మార్చి 1న షబ్బీర్ అలీ హైదరాబాదులో తనపేరున ఫుట్‌బాల్ అకాడమీని ప్రారంభించాడు. ఆ అకాడమీ తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో అనుబంధంగా పనిచేస్తుంది.[14]