షాజిత్ కొయేరికేరళకు చెందిన సౌండ్ డిజైనర్. ఓంకార సినిమాకి ఫిల్మ్‌కి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు ఐఫా అవార్డులను కూడా గెలుచుకున్నాడు.[1] కమీనే సినిమాకి స్టార్ స్క్రీన్ అవార్డును కూడా అందుకున్నాడు.[2][3] ఫాలీ ఎడిటింగ్, ప్రీ-మిక్సింగ్ లకు ప్రసిద్ది చెందాడు.[4]
షాజిత్ కొయేరి, సోమ సుందరన్ - రతీబాయి దంపతులకు కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లాలోని పున్నోల్‌లో జన్మించాడు.[5] తలస్సేరిలోని బ్రెన్నాన్ కళాశాలలో చదువుకున్నాడు. 1999లో ముంబై నగరానికి వెళ్ళాడు.
2003లో వచ్చిన పర్ఫెక్ట్ హజ్బెండ్ అనే సినిమాకు తొలిసారిగా పనిచేశాడు. తరువాత సంజయ్ లీలా భన్సాలీ తీసిన బ్లాక్ అండ్ సావరియా, షిమిత్ అమీన్ తీసిన అబ్ తక్ చప్పన్, కేతన్ మెహతా తీసిన మంగళ్ పాండే: ది రైజింగ్, రోహన్ సిప్పీ తీసిన బ్లఫ్ మాస్టర్! వంటి సినిమాలకు పనిచేశాడు. శశాంత్ షా దాస్విదానియా తీసిన ఛలో ఢిల్లీ, అపర్ణా సేన్ తీసిన 15 పార్క్ అవెన్యూ, అభిషేక్ చౌబే తీసిన ఇష్కియా, విశాల్ భరద్వాజ్ తీసిన మక్బూల్, ది బ్లూ అంబ్రెల్లా, ఓంకార, కమీనే, 7 ఖూన్ మాఫ్ లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన అనేక డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లకు కూడా పనిచేశాడు.[6]మలయాళ మనోరమలో వచ్చిన ది ఎకో (గ్రాఫిక్ నవల) లో షాజిత్ జీవిత కథ వివరించబడింది.[7]