వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | మియాన్వాలి, పంజాబ్, పాకిస్తాన్ | 1998 అక్టోబరు 4|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | షడ్డీ[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సక్లైన్ ముస్తాక్ (మామ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 227) | 2017 ఏప్రిల్ 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2020 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 211) | 2017 ఏప్రిల్ 7 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 10 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 7 (formerly 29) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 73) | 2017 మార్చి 26 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 14 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 7 (formerly 29) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Rawalpindi Rams | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–present | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Trinbago Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Brisbane Heat | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | గయానా Amazon వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2023 | Northern | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | Dhaka Platoon | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | San Francisco Unicorns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 30 August 2023 |
షాదాబ్ ఖాన్[3] పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు, వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు.[4] పాకిస్తాన్ సూపర్ లీగ్,[5] దేశవాళీ క్రికెట్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.[6] ఆల్ రౌండర్ గా, పాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టీ20 బౌలర్ గా రాణించాడు.[7] పాకిస్తాన్‌లోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకరిగా కూడా పరిగణించబడ్డాడు.[8][9] 2022 నాటికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కేంద్రంగా కాంట్రాక్ట్ చేసిన ఆటగాళ్ళలో ఒకడిగా ఉన్నాడు.[10][11] 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్థాన్ జట్టులో ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు.
2023 జనవరి 23న పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ అంతర్జాతీయ ఆటగాడు సక్లైన్ ముస్తాక్ కుమార్తె మలైకా సక్లైన్‌ను ప్రైవేట్ నికా వేడుకలో వివాహం చేసుకున్నాడు.[12]
2020 డిసెంబరు 18న, బాబర్ గాయం సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లో జట్టుకు నాయకత్వం వహించినప్పుడు ఖాన్ మొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016 ఆగస్టు 26న, 2016–17 జాతీయ టీ20 కప్‌లో రావల్పిండి తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[13] 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, అతను 2017 కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడటానికి సంతకం చేసాడు.[14] తర్వాత 2017లో, షాదాబ్ బిగ్ బాష్ లీగ్ 7వ సీజన్ కోసం బ్రిస్బేన్ హీట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[15] ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.
2019 జూన్ లో, ఖాన్ 2019 గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్‌లో ఎడ్మోంటన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[16] 2021 డిసెంబరులో, 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్ తర్వాత ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2017 మార్చి 26న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[17]
2017 ఏప్రిల్ 7న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[18] 2017 ఏప్రిల్ 30న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[19] 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2017 సెప్టెంబరులో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[20]
2021 సెప్టెంబరులో, ఖాన్ 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[21]
2023 మార్చి 27న, ఆఫ్ఘనిస్తాన్‌పై తన 100వ టీ20 అంతర్జాతీయ వికెట్‌ను తీసుకున్నాడు,[22] టీ20లలో 100 వికెట్లు తీసిన పాకిస్తాన్ నుండి మొదటి క్రికెటర్ అయ్యాడు.[23]