షామీ చక్రవర్తి | |
---|---|
జననం | శర్మిష్ట చక్రవర్తి 1969 జూన్ 16 లండన్ , ఇంగ్లాండ్ |
విద్యాసంస్థ | లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్సు |
వృత్తి | లాయర్, డైరక్టర్ ఆఫ్ లిబర్టీ |
జీవిత భాగస్వామి | Separated 2012 |
పిల్లలు | 1 |
శర్మిష్ట చక్రవర్తి[2][3] CBE (జననం 1969 జూన్ 16) ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గా ఉన్నారు.[4]. ఆమె బ్రిటిష్ సివిల్ లిబర్టీస్ అడ్వకసీ ఆర్గనైజేషన్ లిబెర్టీకు సెప్టెంబరు 2003 నుండి డైరక్టరుగా యున్నారు. న్యాయశాస్త్రంలో ప్రపంచస్థాయిలో అఖండ ఖ్యాతి నార్జించింది.
షామీ చక్రవర్తి హిందూ-బెంగాలీ కుటుంబంలో లండన్ బొరో ఆఫ్ హారో లోని కెంటన్ ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి జమా ఖర్చు లెక్కలు వ్రాయ గుమస్తాగా ఉండేవారు. ఆమె లండన్ లో జూన్ 16 1969 న జన్మించారు. స్థానిక వెట్లీవుడ్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు[5]. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఎల్.ఎల్.బి.పట్టాను పొందారు[3]. బారిస్టర్ గా 1994 లో ఉన్నత స్థాయిలో నమోదు అయ్యారు. హో అఫీస్ లో బారిస్టర్ గా కొంతకాలం (1996-2000) పనిచేస్తూ, న్యాయ శాస్త్రాన్ని అపోసన పట్టారు. మరో వైపు పలు క్లిష్టమైన, వివాదాస్పదమైన కేసులను అవలీలగా పరిష్కార దిశకు తీసుకు వెళ్లగలిగారు[2].
చక్రవర్తి సోషల్ డెమొక్రటిక్ పార్టీలో 1985 నుండి 1987 ల మధ్య క్రియాశీల సభ్యులుగా ఉన్నారు.ఆమెకు 18 యేండ్లు వచ్చే ముందు దానిని విడిచిపెట్టారు.[6]
2001 సెప్టెంబరు 10 న ఆమె హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో ప్రవేశించారు.[7] బ్రిటిష్-అమెరికన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంగ్లో-అమెరికన్ సంబంధాలమీద గాఢ అధ్యయనం చేసి లీగల్ అడ్వయిజర్ గా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. 2003 లో ప్రతిష్ఠాత్మక హౌస్ కు డైరక్టర్ గా నియమితులై బ్రిటిష్ దేశవాసుల దృష్టిని ఆకర్షించారు.[8][9]
ప్రతిభావంతురాలైన న్యాయవాదిగా మాత్రమే కాకుండా పౌర హక్కుల పరిరక్షణకు నడుం కట్టి "లిబర్టీ" పేరుతో ఒక పౌరహక్కుల సంఘాన్ని స్థాపించడాంలో అసాధారణ సాహసాన్ని ప్రదర్శించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు, సాధారణ ప్రజలకు చేరువై పలు ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ నాటికీ సామాన్య ప్రజల ప్రయోజనార్థం పలు తరహా ఉద్యమాలను చేపడుతూనే ఉన్నారు.[10]
9/11 గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన తేదీ 2001, సెప్టెంబరు 11 న అమెరికా దేశం మీద జరిగిన ముష్కర దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా "యాంటీ టెర్రరిజం అండ్ క్రైం సెక్యూరిటీ యాక్ట్"ను వెలికి తీసుకు వచ్చి దానిని అమలు పరచడానికి బ్రిటన్ ప్రభుత్వం మీద సాధిరారిక ఒత్తిడి తీసుకువచ్చారు. తాను స్థాపించిన లిబర్టీ సంఖం తరపున బి.బి.సి రేడియో కార్యక్రమాలలోని "ముఖాముఖి" ద్వారా వందలాది మందికి న్యాయ సలహాలు అందించి న్యాయ శాస్త్ర ప్రవీణురాలిగా దేశ ఖ్యాతిని గడించారు. ఇందులో భాగంగానే దేశాన్ని ఇరకాటంలోనికి నెడుతున్న పలు సామాజిక, రాజకీయ సమస్యల గురించి అత్యద్భుతంగా విశ్లేషణ చేశారు. తన లిబర్టీ సంస్థ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి "నేను నిలబడతానంటూ" మహిళా లోకానికి భరోసా ఇచ్చి వెన్ను దన్నుగా నిలిచారు.
న్యాయ శాస్ర విధ్వాంసురాలైన ఆమె 1995 లో బ్రిటిషరునే వివాహం చేసుకున్నారు. ఆంగ్లీ-ఇండియన్ సత్సంబంధాల కోసం కృషి చేస్తున్న "టోటల్ పాలిటిక్స్" అనే మాస పత్రికకు సంపాదక సభ్యురాలిగా ఉంటూ ఆంగ్లో-ఇండియన్ ల సమైక్యతకు అఖండ కృషి చేశారు. ఒక న్యాయవాదిగా, వ్యాఖ్యాతగా, సామాజిక సేవకురాలిగా బ్రిటిషర్స్ అందరికీ సుపరిచితమైన ఈమె వాగ్దాటి రాజకీయ నాయకులకే భయ ప్రకంపనలు సృష్టిస్తుంది. న్యాయం కోసం, ప్రజా సంక్షేమం కోసం దేశ ప్రధానులనైనా సూటిగా నిర్మాణాత్మక విమర్శలతో ఎదుర్కోగల ధీశాలి. బ్రిటన్ లో "మోస్ట్ ఎన్ స్పైరింగ్ పొలిటికల్ ఫిగర్"గా ఈమెను "ఛానెల్ 4" వారు 2006 లో అవార్డు ప్రదానం చేసారు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)