షెహర్ ఔర్ సప్నా |
---|
 షెహర్ ఔర్ సప్నా సినిమా పోస్టర్ |
దర్శకత్వం | ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ |
---|
కథ | ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ |
---|
తారాగణం | దిలీప్‌రాజ్ నానా పల్సీకర్ మన్మోహన్ కృష్ణ డేవిడ్ అబ్రహం అన్వర్ హుస్సేన్ సురేఖా పరాకర్ |
---|
ఛాయాగ్రహణం | రామచంద్ర |
---|
కూర్పు | మోహన్ రాథోడ్ |
---|
సంగీతం | జె.పి. కౌశిక్ |
---|
విడుదల తేదీ | 1963 |
---|
సినిమా నిడివి | 120 నిముషాలు |
---|
దేశం | భారతదేశం |
---|
భాష | హిందీ |
---|
షెహర్ ఔర్ సప్నా, 1963లో విడుదలైన హిందీ సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిలీప్‌రాజ్, నానా పల్సీకర్, మన్మోహన్ కృష్ణ, డేవిడ్ అబ్రహం, అన్వర్ హుస్సేన్, సురేఖా పరాకర్ తదితరులు నటించారు.[1] 1964 జరిగిన 11వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఉత్తమ చలన చిత్రం అవార్డును గెలుచుకుంది, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది.[2]
ఒక యువ జంట ఒక నగరంలో తమ సొంత ఇల్లు కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలోకి కొత్త జీవితంమీద ఆశతో అనేక మంది ప్రజలు తరలివస్తుంటారు.[3]
అబ్బాస్ తన జీవితంలో ఒకానొక సమయంలో ఫుట్‌పాత్‌పై పడుకున్న తన అనుభవాలను తన మూడు ఇతర చిత్రాలలో ఉపయోగించాడు. చాలా సన్నివేశాలను బయటి ప్రాంతాలలో చిత్రీకరించినప్పటికీ, ముంబై మురికివాడలు, రోడ్లలో, షూస్ట్రింగ్ బడ్జెట్‌లో, కీలకమైన సన్నివేశాల కోసం, స్థూపాకార డ్రెయిన్‌పైప్‌లను స్టూడియోలకు తీసుకువెళ్ళారు. పట్టణంలోని పేదవారి జీవితాన్ని చూపించడానికి, రైల్వే లైన్ మురికివాడలు, గుడిసెలతో పూర్తి చేశారు.[4][5]
- దిలీప్ రాజ్ (పైడి జైరాజ్ కుమారుడు)
- సురేఖా పార్కార్
- మన్మోహన్ క్రిషన్
- అన్వర్ హుస్సేన్
- డేవిడ్ అబ్రహం
- నానా పాల్సికర్ (జానీ)
- అసిత్ సేన్
- జగదీష్ కమల్
- రషీద్ ఖాన్
- కమలకర్ రిలే (దొంగ)
- "హజార్ ఘర్ హజార్ దార్ యే సబ్ హై అజ్నాబీ మాగర్" - మన్మోహన్ కృష్ణ
- "పత్తర్ కా భగవాన్ యెహన్ హై" - మన్మోహన్ కృష్ణ
- "ప్యార్ కో ఆజ్ నాయి తార్ నిభన హోగా" - మన్మోహన్ కృష్ణ
- "యే షామ్ భీ కహాన్ హుయ్" - మన్మోహన్ కృష్ణ
- 1963: ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం [6]
- ఉత్తమ దర్శకుడిగా 1964 అకాడమీ ఆఫ్ ఆర్ట్ అవార్డు.
- 1964: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
- ఉత్తమ సహాయ నటుడు - నానా పాల్సికర్ : విజేత
- ఉత్తమ చిత్రం: నామినేటెడ్ [7]
- ఉత్తమ దర్శకుడు: కె.ఎ.అబ్బాస్: నామినేటెడ్
- ఉత్తమ కథ: కెఎ అబ్బాస్: నామినేట్
- ఉత్తర ప్రదేశ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అస్న్. ఉత్తమ సంగీతం/దర్శకుడికి లక్నో అవార్డు: జెపి కౌశిక్
- బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అస్న్. ఉత్తమ సంగీతం/దర్శకుడిగా కలకత్తా అవార్డు: జెపి కౌశిక్