![]() 2009లో యూనివర్సిటీ ఓవల్ వద్ద బాండ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షేన్ ఎడ్వర్డ్ బాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్ | 1975 జూన్ 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | James Bond, Bondy, 007 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 216) | 2001 22 November - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2009 24 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 124) | 2002 11 January - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 13 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 27 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 13) | 2005 21 October - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 10 May - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996/97–2009/10 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | Hampshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Kolkata Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2010 10 May |
షేన్ ఎడ్వర్డ్ బాండ్ (జననం 1975, జూన్ 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్. ముంబై ఇండియన్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.[1] "సర్ రిచర్డ్ హాడ్లీ తర్వాత న్యూజీలాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్" గా రాణించాడు.[2][3] టెస్ట్, వన్డే, ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. న్యూజీలాండ్ దేశీయ క్రికెట్‌లో కాంటర్‌బరీ, ఇంగ్లీష్ దేశీయ క్రికెట్‌లో వార్విక్షైర్ తరపున ఆడాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా 2003 ప్రపంచకప్‌లో భారత్‌పై అత్యంత వేగవంతమైన డెలివరీ 156.4 కిమీ/గం వద్ద నమోదైంది.[4]
2001/02 సీజన్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి, తన 34 సంవత్సరాల వయస్సులో 2009 డిసెంబరులో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యే ముందు న్యూజీలాండ్ తరపున 18 టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రమే కనిపించగలిగాడు.[2][5]
2008 మార్చిలో జరిగిన 'రెబెల్' ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఢిల్లీ జెయింట్స్‌తో బాండ్ పాల్గొనడం వల్ల[6] కెరీర్ కూడా 18 నెలల విరామం ఎదుర్కొంది, దీని కారణంగా న్యూజీలాండ్ క్రికెట్ బోర్డుసెంట్రల్ కాంట్రాక్ట్‌ను 2008 జనవరిలో రద్దు చేసింది.[7] అయినప్పటికీ, 2009 జూన్ లో బాండ్ తిరుగుబాటు లీగ్‌తో సంబంధాలను తెంచుకున్నాడు. మరోసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకున్నాడు.[8] 2010 జనవరిలో, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 3వ సీజన్‌లో ఆడేందుకు బాండ్ ఎంపికయ్యాడు. 2010 మే 13న అన్ని రకాల ఆటల నుండి రిటైర్ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్‌లో ఆడలేదు. క్రిక్‌ఇన్‌ఫోలో బ్రైడన్ కవర్‌డేల్ అతన్ని న్యూజీలాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా అభివర్ణించాడు.[9]
జార్జ్ లోమాన్ తర్వాత బాండ్ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యుత్తమ బౌలింగ్ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు (కనీసం 2,500 బంతులు వేసిన బౌలర్లలో).[10]