సంచారి విజయ్ | |
---|---|
జననం | విజయ్ కుమార్ బసవరాజయ్య 1983 జూలై 18 పంచనహళ్లి, చికమగలూర జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం |
మరణం | 2021 జూన్ 15 బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | (వయసు 37)
మరణ కారణం | రోడ్డు ప్రమాదం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007–2021 |
గుర్తించదగిన సేవలు | నాను అవనల్ల.. అవలు |
సంచారి విజయ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన కన్నడ, తమిళ్, తమిళ భాషా చిత్రాల్లో నటించాడు.విజయ్ 2011లో వచ్చిన రంగప్ప హోంగ్బిట్నా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2015లో ట్రాన్స్‌జెండర్‌గా నటించిన "నాను అవనల్ల.. అవలు" సినిమా గాను జాతీయ అవార్డు అందుకున్నాడు.
సంచారి విజయ్ 18 జూలై 1983లో పంచనహళ్లి గ్రామం, కడూరు తాలూకా, చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. ఆయన తండ్రి బసవరాజయ్య సినీ నటుడు, సంగీత దర్శకుడు, తల్లి గౌరమ్మ నర్స్, జానపద గాయని.[1] విజయ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సంచారి థియేటర్ తో ఆర్టిస్ట్ గా కోర్స్ పూర్తి చేశాడు.[2][3]
సంచారి విజయ్ 2021 జూన్ 12న రేషన్ పంపిణి చేసేందుకు తన స్నిహితులతో కలిసి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బెంగళూరు జేపీఎనగర్‌లోని ఎల్‌అండ్‌టీ సౌత్‌సిటీ వద్ద రాత్రి 11.30గంటల సమయంలో వాళ్లు ప్రయాణిస్తున్న ద్వికచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో విజయ్ తలకు తీవ్ర గాయమైంది, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి 2021 జూన్ 15న మరణించాడు.[4][5] విజయ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో నిర్వహించారు.[6]
† | Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా | పాత్ర పేరు | ఇతర విషయాలు | Ref. |
---|---|---|---|---|
2011 | రంగప్ప హోంగ్బిట్నా | కృష్ణ | ||
రామ రామ రఘు రామ | ||||
2013 | దసవాల | అవటివాడు | ||
2014 | హరివూ | రైతు | ||
ఉన్ సమాయల్ ఆరాయిల్ ఒగ్గరానే | రామ్ | |||
2015 | నాను అవనల్ల.. అవలు | మాదేశ /విద్య | జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు ఉత్తమ నటుడు– సౌత్ |
|
2016 | కిల్లింగ్ వీరప్పన్ | స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గోపాల్ | ||
సినిమా మై డార్లింగ్ | అతిథి పాత్రలో | |||
గోధి బన్న సాధారాణ మైకట్టు | అతిథి పాత్రలో | |||
సిపాయి | మంజు | |||
ఇదోళ్లే రామాయణ | [7] | |||
2017 | రిక్త | రిక్త | "దుంటాక" పాటను పాడాడు | [8] |
అల్లామా | బసవ | [9] | ||
హోసా అనుభవ | [10] | |||
మారికొండవారు | [11] | |||
నాన్ మగళే హీరోయిన్ | విజయ్ | [12] | ||
అవ్యక్త | రాజశేఖర్ | లఘు చిత్రం | [13] | |
2018 | వర్తమాన | అనంత్ | [14] | |
కృష్ణ తులసి | కృష్ణ | [15] | ||
6నే మైలి | అర్జున్ | [16] | ||
పాదరస | పాదరస | [17] | ||
నాతిచరామి | సురేష్ | |||
శ్రీ గురు కొత్తూరేశ | అక్బర్ | |||
2019 | ఆడువా గొంబే | మాధవ | ||
ఆటక్కుంటూ లెక్కక్కిళ్ళ | పురుషోత్తం | |||
2020 | జెంటిల్మన్ | శివమూర్తి | ||
ఆక్ట్ 1978 | భీమేశ్వర పాండే | |||
2021 | తలిదండ - రిలీజ్ కావాల్సిన ఉంది | కున్నెగౌడ "కున్న" | పోస్ట్ -ప్రొడక్షన్ | [18] |
మెలొబ్బా మాయావి - రిలీజ్ కావాల్సిన ఉంది | ఇరువై | పోస్ట్ -ప్రొడక్షన్ | ||
పిరంగిపుర - రిలీజ్ కావాల్సిన ఉంది | పోస్ట్ -ప్రొడక్షన్ | |||
పిక్సట్టే లైఫు- రిలీజ్ కావాల్సిన ఉంది | పోస్ట్ -ప్రొడక్షన్ |