సంతోష్ గంగ్వార్ | |||
![]()
| |||
చైర్ పర్సన్ - పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1 ఆగష్టు 2021 | |||
నియమించిన వారు | ఓం బిర్లా | ||
---|---|---|---|
ముందు | మీనాక్షి లేఖి | ||
కార్మిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | బండారు దత్తాత్రేయ | ||
తరువాత | భూపేంద్ర యాదవ్ | ||
కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | జయంత్ సిన్హా | ||
తరువాత | శివ్ ప్రతాప్ శుక్లా | ||
కేంద్ర జౌళీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 7 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కావూరు సాంబశివరావు | ||
తరువాత | స్మృతి ఇరాని | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | ప్రవీణ్ సింగ్ ఆరోన్ | ||
పదవీ కాలం 1989 – 2009 | |||
ముందు | బేగం అబీదా అహ్మద్ | ||
తరువాత | ప్రవీణ్ సింగ్ ఆరోన్ | ||
నియోజకవర్గం | బరేలీ | ||
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్‌పర్సన్
| |||
పదవీ కాలం 2009 – 2010 | |||
ముందు | విజయ్‌కుమార్ మల్హోత్రా | ||
తరువాత | జస్వంత్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బరేలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1 నవంబరు 1948||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సౌభాగ్య గంగ్వార్ | ||
సంతానం | 2 | ||
నివాసం | బరేలీ | ||
పూర్వ విద్యార్థి | • ఆగ్రా యూనివర్సిటీ (బి.ఎస్.సి) • రోహిలాఖండ్ యూనివర్సిటీ (ఎల్‌ఎల్‌బీ) | ||
మూలం | [1] |
సంతోష్ కుమార్ గంగ్వార్ (జననం 1948 నవంబరు 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] సంతోష్ కుమార్ గంగ్వార్ 2017 సెప్టెంబరు 3 నుండి 7 జూలై 2021 వరకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణంగా 2021 జూలై 7న మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[3]
సంతోష్ గంగ్వార్‌ను 2024 జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు.[4]
గంగ్వార్ 1989లో 9వ లోక్‌సభకు బరేలీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీగా అడుగుపెట్టాడు. ఆయన1996లో బీజేపీ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. గంగ్వార్ తరువాత 2009 వరకు వరుసగా ఆరు సార్లు ఎంపీగా ఎన్నికై 14వ లోక్‌సభలో బీజేపీ పార్టీ చీఫ్ విప్‌గా నియమితుడై, 2009లో జరిగిన 15వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.
గంగ్వార్ 2014లో 16వ లోక్‌సభకు తిరిగి ఎంపీగా ఎన్నికై 2014 మే 26 నుండి 2016 జూలై 5 వరకు జౌళి శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 5 జూలై 2016 నుండి 2017 సెప్టెంబరు 3 వరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.
సంతోష్ గంగ్వార్‌ను 2024 జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు.[5]