సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన

సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (SAGY)
దేశంభారతదేశం
ప్రధానమంత్రి(లు)నరేంద్ర మోదీ
ప్రారంభం11 అక్టోబరు 2014; 10 సంవత్సరాల క్రితం (2014-10-11)
స్థితిఅమలులో ఉంది

సంసద్‌ ఆదర్శ  గ్రామీణ యోజన (ఆంగ్లం: Sansad Adarsh Gram Yojana; హిందీ: सांसद आदर्श ग्राम योजना) అనేది గ్రామాలలో అభివృద్ధిపై విస్తృతంగా దృష్టి సారించే ఒక గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం.[1] ఇది 2014 అక్టోబరు 11న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.[2]

ఆదర్శ గ్రామాలు

[మార్చు]

మహాత్మా గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా భారతదేశంలోని గ్రామాల్లో మార్పును తీసుకురావటం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు ఒక గ్రామపంచాయతీని దత్తత తీసుకుని, ఆ గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రమైన సాంఘిక పురోగతి కూడా చోటు చేసుకొనేటట్లు మార్గదర్శకత్వం వహిస్తారు. పట్టణాలకు దీటుగా పల్లె ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో పార్లమెంట్‌ సభ్యులు తమ నియోజకవర్గాలు, రాజ్యసభ సభ్యులు దేశంలోని ఏవైనా గ్రామాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన. ఈ క్రమంలో పలు అంశాల్లో ప్రగతి సాధించిన గ్రామాలకు తగిన ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఎస్‌ఏజీవై కింద ఆదర్శ గ్రామాలుగా ప్రకటిస్తుంది కేంద్రం.[3]

నిధులు

[మార్చు]

సంసద్‌ ఆదర్శ  గ్రామీణ యోజనకు కొత్త నిధులు కేటాయించబడవు. అయితే ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నిధులు సేకరించవచ్చు. ఉదాహారణకు..

  • ఇందిరా ఆవాస్ యోజన
  • ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
  • బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్
  • పార్లమెంటు సభ్యుడు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS)
  • గ్రామ పంచాయతీ సొంత ఆదాయం
  • కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు
  • కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు

తెలంగాణ ఘనత

[మార్చు]

సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే. అలాగే టాప్‌–20లో 19 గ్రామాలు కూడా రాష్ట్రానికి చెందినవే. కేంద్ర ప్ర‌భుత్వం 2022 ఏప్రిల్ 26న ప్ర‌క‌టించిన ఆద‌ర్శ గ్రామాల జాబితా వివరాలను కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.[4]

దేశంలో టాప్‌–10 తెలంగాణ ఆదర్శ గ్రామాలు:

(వంద మార్కులకు వచ్చిన స్కోరు ఆధారంగా వరుసగా..)

  1. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని వడపర్తి
  2. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్
  3. నిజామాబాద్‌ జిల్లాలోని పల్డా
  4. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్
  5. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక
  6. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌
  7. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్
  8. నిజామాబాద్‌ జిల్లాలోని తానాకుర్దు
  9. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కుక్‌నూర్
  10. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి

మూలాలు

[మార్చు]
  1. "Prime Minister Modi announces 'Sansad Aadarsh Gram Yojana'". Yahoo News. Retrieved 11 October 2014.
  2. "Sansad Adarsh Gram Yojna: Modi has stumped his opponents again". First Post. Retrieved 11 October 2014.
  3. "ప్రగతి పల్లెవి!". web.archive.org. 2022-04-27. Archived from the original on 2022-04-27. Retrieved 2022-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Saansad Adarsh Gram Yojana: ఆదర్శ గ్రామాల్లో మొదటి పది గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవి? | Sakshi Education". web.archive.org. 2022-04-27. Archived from the original on 2022-04-27. Retrieved 2022-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)