![]() సక్లైన్ ముస్తాక్ (2020) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1976 డిసెంబరు 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | షాదాబ్ ఖాన్ (అల్లుడు)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 134) | 1995 సెప్టెంబరు 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఏప్రిల్ 1 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 103) | 1995 సెప్టెంబరు 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 అక్టోబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994–2004 | Pakistan Intl. Airlines | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994–1998 | Islamabad | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–2008 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003–2004 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2009 డిసెంబరు 8 |
సక్లైన్ ముస్తాక్, పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[2] 2021 - 2022 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.[3] ఇతను ఆఫ్ బ్రేక్ యాక్షన్‌తో బౌల్ చేయబడిన లెగ్ బ్రేక్ డెలివరీ "దూస్రా"కు మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200, 250 వికెట్ల మైలురాళ్లను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.[4] 1999 టోర్నమెంట్‌లో జింబాబ్వేపై చేసిన క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి పాకిస్థానీగా ముష్తాక్ చరిత్ర సృష్టించాడు.
కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా, సక్లైన్ 1995 - 2004 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 49 టెస్ట్ మ్యాచ్‌లు, 169 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇతను 208 టెస్ట్, 288 వన్డే వికెట్లు తీశాడు.[5] 2001 మార్చిలో న్యూజిలాండ్‌కి వ్యతిరేకంగా ఒక టెస్ట్ మ్యాచ్ సెంచరీని కూడా సాధించాడు.[6] 2016 వరకు, వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా సక్లైన్ నిలిచాడు.[7][8]
సక్లైన్ 1976, డిసెంబరు 29న లాహోర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి ప్రభుత్వ గుమస్తా. ఇతనికి ఇద్దరు అన్నలు (సిబ్టెన్, జుల్ఖుర్నైన్) ఉన్నారు. వారిద్దరు లాహోర్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. సక్లైన్ ప్రభుత్వం తరపున ఆడాడు. లాహోర్ ఎంఏఓ కళాశాల మూడు సంవత్సరాలపాటు ప్రతి సంవత్సరం ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[5][8] పాఠశాల స్థాయిలో ఎప్పుడూ క్రికెట్ ఆడని సక్లైన్, తన 13 సంవత్సరాల వయస్సులో జరీఫ్ మెమోరియల్ క్రికెట్ క్లబ్ సెకండ్ ఎలెవెన్ కోసం ఆడటం ప్రారంభించాడు.[8] క్లబ్ స్థాయిలో అహ్మద్ హసన్, తన సోదరులు సక్లైన్‌కు శిక్షణ ఇచ్చారు. లాహోర్ ఎంఏఓ కళాశాలలో ముంతాజ్ అక్తర్ బట్ చేత శిక్షణ పొందాడు. కళాశాల తరపున ఆడాడు, వరుసగా మూడు సంవత్సరాలు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నది.[8]
1998 డిసెంబరులో సక్లైన్ ముస్తాక్ కు సనా ముష్తాక్ అనే బ్రిటిష్ పాకిస్తానీతో వివాహం జరిగింది.[9][10][11] 2007లో తన బ్రిటీష్ పాస్‌పోర్ట్‌ను అందుకున్నాడు.[12][13] ఇతని కుమార్తె మలిక, పాకిస్థాన్ క్రికెటర్ షాదాబ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.[14]
1994–95లో 17 సంవత్సరాల వయస్సులో సక్లైన్ తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. మొదటి సీజన్‌లో అతను 52 వికెట్లు తీశాడు. ఢాకాలో జరిగిన ఒక-రోజు టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఎ జట్టు తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. 1995 సెప్టెంబరులో పిసిబి పాట్రన్స్ ఎలెవెన్ కోసం ఏడు వికెట్లు తీసి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఇతను "తాను చూసిన గొప్ప ఆఫ్ స్పిన్నర్", "ఫాస్ట్ బౌలర్ వలె దూకుడుగా ఉంటాడు, దెబ్బలు తగులుతుందేమోనని భయపడలేదు, నమ్మకం తనపై ఉంది." అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అతని గురించి చెప్పాడు.[8]
1995 సెప్టెంబరులో పెషావర్‌లోని అర్బాబ్ నియాజ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సక్లైన్ టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[5] ఆ మ్యాచ్‌లో 26.75 సగటుతో నాలుగు వికెట్లు తీశాడు.[15] రెండు టెస్టుల సిరీస్‌లో తొమ్మిది వికెట్లు సాధించాడు.[16] తర్వాత సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో సహా[17] రెండు టెస్టుల్లో 14 వికెట్లు తీసినవారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.[18] ఆరునెలల తర్వాత రావల్పిండి క్రికెట్ స్టేడియంలో స్వదేశీ సిరీస్‌లో మొదటి టెస్ట్ లో భాగంగా దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్లు తీశాడు.[19] తరువాత స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో, కరాచీలోని నేషనల్ స్టేడియంలో మూడో టెస్టులో ఆడి, 80 పరుగులకు తొమ్మిది వికెట్లు తీశాడు, ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[20] లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జింబాబ్వేపై ఐదు వికెట్లు సాధించాడు.[21]
1995 సెప్టెంబరులో సక్లైన్ తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. గుజ్రాన్‌వాలాలోని మునిసిపల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ లో ఇతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు, కానీ పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో గెలిచింది.[22] 1996 సింగర్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 3 వికెట్లు తీశాడు.[23] 2000 అక్టోబరులో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 20 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఇతని కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇది.[24] వన్డేల్లో ఆరుసార్లు ఐదు వికెట్లు తీశాడు.[25] ఇతను జింబాబ్వేపై రెండు హ్యాట్రిక్‌లు (మొదటిది 1996లో, రెండవది 1999లో) సాధించాడు. ప్రపంచ కప్‌లో అలా చేసిన మొదటి పాకిస్తానీగా నిలిచాడు.[26]
2016 మే 28 మేన, పాకిస్తాన్‌తో జరిగే స్వదేశీ సిరీస్ కోసం సక్లైన్ ముస్తాక్‌ను ఇసిబి ఇంగ్లాండ్ స్పిన్ కన్సల్టెంట్‌గా నియమించింది.[27]
2016 అక్టోబరు 29న, భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టును సిద్ధం చేయడానికి సక్లైన్ సేవలను ఉపయోగించాలని ఇసిబి నిర్ణయించింది.[28] 2016 నవంబరు 13న, ఈసిబాతో తన ఒప్పందానికి పొడిగింపును అంగీకరించిన తర్వాత, అతను మొహాలీలో మూడో టెస్టు ముగిసే వరకు ఇంగ్లాండ్ జట్టుతో ఉంటాడని ప్రకటించబడింది.[29]
2021 సెప్టెంబరు 6న, మిస్బా-ఉల్-హక్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, అతన్ని పిసిబి పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించింది.[30] 2022 ఫిబ్రవరిలో, ఇతని ఆధ్వర్యంలోని జట్టు అద్భుతమైన ప్రదర్శన కారణంగా, అతని ఒప్పందం ఒక సంవత్సరం పాటు పొడిగించబడింది.[3]