సజ్జాద్ అక్బర్

సజ్జాద్ అక్బర్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 182 119
చేసిన పరుగులు 5 6,571 1,607
బ్యాటింగు సగటు 5.00 30.42 24.72
100s/50s 0/0 7/31 0/9
అత్యధిక స్కోరు 5 143 71*
వేసిన బంతులు 60 38,652 5,596
వికెట్లు 2 640 142
బౌలింగు సగటు 22.50 25.40 27.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 37 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 8 0
అత్యుత్తమ బౌలింగు 2/45 9/59 6/46
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 119/– 36/–
మూలం: Cricinfo, 2013 ఏప్రిల్ 11

సజ్జాద్ అక్బర్ (జననం 1961 మార్చి 1) పాకిస్తానీ మాజీ క్రికెటర్.1990లో రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

జననం

[మార్చు]

సజ్జాద్ అక్బర్ 1961, మార్చి 1న పాకిస్తాన లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్-స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1978-79 నుండి 2000-01 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1989-90 సీజన్‌లో 22.38 సగటుతో 104 వికెట్లు కూడా తీశాడు.[3] 1987-88లో కరాచీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ క్రికెట్ జట్టు తరపున ఆడుతూ 59కి 9, 63కి 6 వికెట్లు తీసుకున్నాడు[4]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 182 మ్యాచ్ లలో 273 ఇన్నింగ్స్ లలో 6571 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 143 కాగా, 7 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు చేశాడు. . బౌలింగ్ లో 38652 బంతులలో 16256 పరుగులు ఇచ్చి, 640 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 9/59 కాగా, 37సార్లు 5 వికెట్లు, 8సార్లు 10 వికెట్లు తీశాడు.

లిస్టు ఎ క్రికెట్ లో 119 మ్యాచ్ లలో 91 ఇన్నింగ్స్ లలో 1607 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 71* కాగా, 9 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 5596 బంతులలో 3935 పరుగులు ఇచ్చి, 142 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 6/46 కాగా, 5సార్లు 4 వికెట్లు, 1సారి 5 వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Sajjad Akbar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "Sajjad Akbar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. First-class bowling in each season by Sajjad Akbar
  4. Karachi v Pakistan National Shipping Corporation 1987-88

బాహ్య లింకులు

[మార్చు]