సతరూప పైనె | |
---|---|
జననం | 1995 (age 29–30)[citation needed] |
జాతీయత | బారతీయురాలు |
విద్యాసంస్థ | ఆంగ్లంలో మాస్టర్స్ |
వృత్తి | నటి, సూపర్ మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
సతరూప పైనె (ఆంగ్లం: Satarupa Pyne), ఒక భారతీయ మోడల్, నటి. మధుర్ భండార్కర్ నాటకీయ చిత్రం క్యాలెండర్ గర్ల్స్ తో ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమె రెండవ చిత్రం అరిందమ్ నంది బెంగాలీ చిత్రం మెహర్ ఆలీ. ఆమె కొన్ని విజయవంతమైన వెబ్ సిరీస్ లలోనూ నటించింది. వూట్ ఎట్ ఫుహ్ సే ఫాంటసీ కోసం ఒక వయాకామ్ ప్రాజెక్ట్ లో, జీ5 ఒరిజినల్స్ కోసం భలోబాషర్ షాహోర్ లో ప్రధాన పాత్రలో నటించింది.[1]
సతరూప బాగా స్థిరపడిన ర్యాంప్ మోడల్. ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్, బ్లెండర్స్ ప్రైడ్, ఇనిఫ్డ్, దేవ్ ఆర్ నిల్, సబ్యసాచి ముఖర్జీ మరెన్నో ఇతర డిజైనర్ల కోసం ర్యాంప్ మోడల్ గా వ్యవహరించింది.
మధుర్ భండార్కర్ రూపొందించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ఐదుగురు కథానాయికలలో ఒకరిగా ఆమె నటించింది.[1]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
2015 | క్యాలెండర్ గర్ల్స్ | పరోమ ఘోష్ | హిందీ | అరంగేట్రం |
2017 | మెహర్ ఆలీ | బెంగాలీ | ||
2019 | బాడీ మసాజ్ | హిందీ |