సత్తుపల్లి | |
---|---|
Coordinates: 17°12′30″N 80°50′10″E / 17.20833°N 80.83611°E | |
Country | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
విస్తీర్ణం | |
• Total | 19.13 కి.మీ2 (7.39 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 31,857 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,300/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 507303 |
టెలిఫోన్ కోడ్ | 08761 |
Vehicle registration | TS-04 |
సత్తుపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం.[2] చిన్న పట్టణం.అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]
1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 30 పడకల సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పూర్తయిన ఆసుపత్రిని ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం 2020లో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించింది.[4] అయితే ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి, వర్షానికి కురుస్తూ రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతండడంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 34 కోట్ల రూపాయల (రూ. 29 కోట్లు నూతన భవన నిర్మాణానికి, రూ. 5 కోట్లు ఆధునిక పరికరాల కొనుగోలు) నిధులు మంజూరు చేసింది. 2022, జనవరి 29న రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశాడు.[5][6]