సత్య 2 | |
---|---|
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
రచన | రాధికా ఆనంద్ |
నిర్మాత | ఎం. సమంత్ కుమార్ రెడ్డి |
తారాగణం | పునీత్ సింగ్ రతన్ (హిందీ) శర్వానంద్ (తెలుగు) అనైకా సోటి అరాధనా గుప్తా |
ఛాయాగ్రహణం | వికాస్ సరఫ్ |
కూర్పు | జెరిన్ జోస్ |
సంగీతం | అమర్ మొహిలే[1] కెరీ అరోరా |
పంపిణీదార్లు | మమ్మోత్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీs | 25 అక్టోబరు 2013(UAE) 8 నవంబరు 2013 (India) |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ తెలుగు |
బడ్జెట్ | ₹15 crore (US$1.9 million)[2] |
సత్య 2 2013 నవంబరు 8 న విడుదలైన తెలుగు చిత్రం. ఇది గతంలో వచ్చిన సత్య చిత్రానికి కొనసాగింపు చిత్రం.
సత్య అనే ఓ సామాన్య యువకుడు మాఫియాకు కొత్త నిర్వచనం చెప్పేందుకు ముంబై మహానగరానికి చేరుకుంటాడు. సినీ దర్శకుడు కావాలనే ప్రయత్నిస్తున్న నారా అనే స్నేహితుడి వద్ద సత్య ఉంటాడు.దావూద్ ఇబ్రహిం 'డి' కంపెనీ, అబూసలేం, చోటా రాజన్ లాంటి వాళ్లు తమ ఐడెంటీ కోసం పాకులాడి మాఫియాను నిర్మించడంలో విఫలమయ్యారని సత్య అభిప్రాయం. ముంబైని ఏలిన మాఫియా డాన్ ల బాటను ఎంచుకోకుండా ఓ విభిన్నమైన మాఫియా కంపెనీని స్థాపించాలని ప్లాన్ వేస్తాడు. అందుకనుగుణంగానే ముంబై మాఫియా పరిస్థితులను అధ్యయనం చేసి, కొంత మంది వ్యాపారవేత్తలతో కలిసి సత్య ఓ 'కంపెనీ' ఏర్పాటు చేస్తాడు. తాను ఏర్పాటు చేసుకున్న కంపెనీ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాడా? ఆ ప్రక్రియలో సత్యకు ఎదురైనా పరిస్థితులేంటి? కంపెనీ ఏర్పాటు ఎందుకు చేయాలనుకుంటాడనే సందేహాలకు సమాధానమే 'సత్య2' చిత్రం.