సత్యదేవ్ నారాయణ్ ఆర్య | |
---|---|
19వ త్రిపుర గవర్నర్ | |
In office 2021 జులై 7 – 2023 అక్టోబరు 25 | |
ముఖ్యమంత్రి | బిప్లబ్ దేబ్ మాణిక్ సాహా |
అంతకు ముందు వారు | రమేష్ బైస్ |
తరువాత వారు | ఇంద్రసేనా రెడ్డి |
17వ హర్యానా గవర్నర్ | |
In office 2018 ఆగస్టు 25 – 2021 జులై 6 | |
ముఖ్యమంత్రి | మనోహర్ లాల్ ఖట్టర్ |
అంతకు ముందు వారు | కప్తాన్ సింగ్ సోలంకి |
తరువాత వారు | బండారు దత్తాత్రేయ |
గనులు, భూగర్భ శాస్త్ర మంత్రి (బీహార్ ప్రభుత్వం) | |
In office 2010 నవంబరు – 2015 నవంబరు | |
ముఖ్యమంత్రి | నితీష్ కుమార్ జితన్ రామ్ మాంఝీ |
తరువాత వారు | మునేశ్వర్ చౌదరి |
నియోజకవర్గం | రాజ్‌గిర్ |
బీహార్ శాసనసభ శాసనసభ్యుడు | |
In office 1995–2015 | |
అంతకు ముందు వారు | చందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు |
తరువాత వారు | రవి జ్యోతి కుమార్ |
నియోజకవర్గం | రాజ్‌గిర్ |
In office 1977–1990 | |
అంతకు ముందు వారు | చందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు |
తరువాత వారు | చందర్ దేవ్ ప్రసాద్ హిమాన్షు |
నియోజకవర్గం | రాజ్‌గిర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | రాజ్‌గిర్, బీహార్, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత బీహార్, భారతదేశం) | 1939 జూలై 1
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | సరస్వతీ దేవి |
సంతానం | 5 |
నివాసం | త్రిపుర రాజ్‌భవన్ (అగర్తల) త్రిపుర |
సత్యదేవ్ నారాయణ్ ఆర్య (జననం 1937 జూలై 1) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. నారాయణ్ ఆర్య త్రిపుర రాష్ట్ర గవర్నరుగా 2021 జులై 14 నుండి 2023 అక్టోబరు 25 వరకు పదవిలో ఉన్నారు. అతను బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఇతను ఇంతకు పూర్వం హర్యానా గవర్నర్‌గా కూడా సేవలు అందించాడు.[1][2][3] బీహార్ శాసనసభకు రాజ్‌గిర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎన్నికయ్యాడు.[4]
ఆర్య బ్రిటీష్ ఇండియాలోని బీహార్ ప్రావిన్స్‌లోని నలంద జిల్లా లోని రాజ్‌గిర్ లోని గాంధీ తోలాలో 1939 జూలై 1న శివన్ ప్రసాద్, సుందరి దేవి దంపతులకు జన్మించాడు. అతను పాట్నా విశ్వవిద్యాలయం నుండి తన మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ. ఎల్.ఎల్.బి; డిగ్రీలను అందుకున్నాడు. ఆర్య సరస్వతి దేవిని వివాహం చేసుకున్నాడు, అతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆర్య 1988-1998 వరకు బీహార్ ఎస్.సి సెల్ బీజేపీ అధ్యక్షుడిగా అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫ్రంట్ కోశాధికారిగా ఉన్నారు. రాజ్‌గిర్ నుండి ఎనిమిది సార్లు బీహార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన విధానసభ సభ్యుడు, అతను 1979 నుండి 80 వరకు గ్రామీణాభివృద్ధి మంత్రిగా, 2010లో గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిగా పనిచేశారు.[5]