సత్యపాల్ మాలిక్ | |
---|---|
![]() 2018లో మాలిక్ | |
19వ మేఘాలయ గవర్నర్ | |
In office 2020 ఆగస్టు 18 – 2022 అక్టోబరు 3 | |
అంతకు ముందు వారు | తథాగత రాయ్ |
తరువాత వారు | బి.డి. మిశ్రా |
18వ గోవా గవర్నర్ | |
In office 2019 నవంబరు 3 – 2020 ఆగస్టు 18 | |
అంతకు ముందు వారు | మృదుల సిన్హా |
తరువాత వారు | భగత్ సింగ్ కొష్యారి (అదనపు ఛార్జీ) |
10వ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ | |
In office 2018 ఆగస్టు 23 –2019 అక్టోబరు 30 | |
అంతకు ముందు వారు | నరీందర్ నాథ్ వోహ్రా |
తరువాత వారు | పదవి రద్దు చేయబడింది జి. సి. ముర్ము (లెఫ్టినెంట్ గవర్నర్‌గా) |
ఒడిశా గవర్నర్ అదనపు బాధ్యత | |
In office 2018 మార్చి 21 -2018 మే 28 | |
అంతకు ముందు వారు | ఎస్.సి. జమీర్ |
తరువాత వారు | గణేషి లాల్ |
27వ బీహార్ గవర్నర్ | |
In office 2017 సెప్టెంబరు 30 – 2018 ఆగస్టు 21 | |
అంతకు ముందు వారు | |
తరువాత వారు | లాల్జీ టండన్ |
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ | |
In office 1989–1991 | |
అంతకు ముందు వారు | ఉషా రాణి తోమర్ |
తరువాత వారు | షీలా గౌతమ్ |
నియోజకవర్గం | అలీగఢ్ |
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ | |
In office 1980–1989 | |
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హిసవాడ, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ [1] | 1946 జూలై 24
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | భారతీయ క్రాంతి దళ్, జనతాదళ్, కాంగ్రెస్, లోక్‌దళ్, ఎస్.పి |
కళాశాల | మీరట్ విశ్వవిద్యాలయం (B.Sc, LLB) |
సత్య పాల్ మాలిక్ (జననం 24 జూలై 1946) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. మాలిక్ 2018 ఆగస్టు 23 నుండి 2019 అక్టోబరు 23 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర 10వ, చివరి గవర్నర్‌గా పనిచేశారు. అతని పదవీ కాలంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేయడం జరిగింది. తరువాత, అతను గోవాకు 18వ గవర్నరుగా 2019 నవంబరు 3న మారారు. 2020 ఆగస్టు 18 నుండి 2022 అక్టోబరు 3 వరకు మేఘాలయ 21వ గవర్నర్‌గా కూడా పనిచేశారు.[2][3]
1974-77 మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా రాజకీయ నాయకుడిగా అతని మొదటి ప్రముఖ పని. అతను 1980 నుండి 1986, 1986-89 వరకు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1989 నుండి 1991 వరకు జనతాదళ్ సభ్యునిగా అలీగఢ్ నుండి 9వ లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అతను 2017 సెప్టెంబరు 30 నుండి 2018 అక్టోబరు 23 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసారు.[4][5] 2018 మార్చి 21 నుండి 2018 మే 28 వరకు అదనపు బాధ్యతలతో ఒడిశా గవర్నర్‌గా పనిచేసారు.
మాలిక్ ఉత్తర ప్రదేశ్ బాగ్ పట్ లోని హిసావాడ గ్రామంలో జన్మించాడు. [6] [7] [8] వీరిది జాట్ కుటుంబం. ఇతను రాజకీయాల్లో చేరడానికి ముందు మీరట్ కాలేజ్ నుండి తన లా డిగ్రీని పూర్తిచేసాడు. [9] [10]
అతను 1989 లో జనతాదళ్ టికెట్‌పై అలీగఢ్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. మొత్తం 2,33,465 (51.5 శాతం) ఓట్లుతో భారీ విజయం సాధించాడు, అంతకు ముందు సిట్టింగ్ ఎంపీ ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఉషా రాణి తోమర్ 77,958 ఓట్ల తేడాతో ఓడిపోయారు, వీరికి 1,55,507 (34.2 శాతం) ఓట్లు వచ్చాయి. [11] [12] [13] 1996 లో అలీగఢ్ నుండి తిరిగి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. [14]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)