సత్యశోధక్ సమాజ్ అనేది మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని పూణేలో, 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము. అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యోతీబా సతీమణి సావిత్రి బాయి మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారు. 1930లో గాంధీజీ సారథ్యములోని భారత జాతీయ కాంగ్రెస్ లోకి ఈ సమాజము నుంచి నాయకులు వలస వెళ్ళడం వలన ఇది తెరమరుగైనది.
సత్యశోధక్ సమాజ్ స్థాపన లక్ష్యం సమాజములో ఉన్న అణగారిన కులాలకు విద్యను అందించడం. సత్యశోధక్ సమాజ్ లో సభ్యత్వమునకు ఉన్నత వర్గాల ప్రజలు అంటే బ్రాహ్మణులు, ధనవంతులకు, ఉన్నతాదాయ వర్గాల వారికి అనుమతి లేదు. ఈ సమాజంలో అణగారిన వర్గాల వారికి మాత్రమే సభ్యత్వము ఇవ్వబడినది. జ్యోతిరావు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రాహ్మణుల అశాస్త్రీయ, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నాడు. మత పుస్తకాలలోని అసమానత, సనాతన స్వభావం, అసమానతలకు, దురాచారాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు. హిందూ మతంలో మానవ శ్రేయస్సు, ఆనందం, ఐక్యత, సమానత్వం, ఆచారాలు వంటి కొన్ని ఆలోచనలను మనస్సులో ఉంచుకుని, మహాత్మా జ్యోతిరావు ఫులే "దీన బంధు" అనే వార్తాపత్రికను ప్రారంభించి, తన అభిప్రాయాలను తెలిపినాడు. తాము దేవుని దూతగా భావించిన బ్రాహ్మణులపై సత్యశోధక్ సమాజము విశ్వసింపక బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. సత్యశోధక్ సమాజ్ వారు ఉపనిషత్తులు, వేద సంస్కృతిని నమ్మలేదు. ఆర్యన్ సమాజాన్ని గౌరవించటానికి కూడా వీరు తిరస్కరించారు. మరాఠా పాలకుడు షాహు మహారాజ్ ఫులే మరణించిన తరువాత ఈ ఉద్యమం ఆగిపోలేదు. ఆ తరువాత భరావు పాటిల్, మరాఠా నాయకులు కేశవరావు జెధే, నానా పాటిల్, ఖండేరావ్ బాగల్, మాధవరావు బాగల్ ఈ ఉద్యమాన్ని విస్తరించారు.[1]
మహాత్మా జోతిరావు సత్య శోదక్ సమాజ్ మొదటి అధ్యక్షుడిగా, కోశాధికారిగా, నారాయణరావు గోవిందరావు కడలక్ మొదటి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. శూద్రులను బ్రాహ్మణ గ్రంథాల ప్రభావం నుండి విమోచించడం, శూద్రులను మత బానిసత్వం నుండి , విగ్రహ ఆరాధన ఖండించడం ,అందరు ఒకే దేవుడి పిల్లలు, ఆ పిల్లలు దేవునికి అర్పించడానికి పూజారి లేదా మత గురువుల వంటి మధ్యవర్తుల అవసరం లేదు. సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలలో శూద్రులను ఉన్నత కులాల వారినుంచి రక్షించించడం , సత్య షోధక్ సమాజ్ ద్వారా, వేదాలను పవిత్రంగా పరిగణించదానికి జోతిరావు అంగీకరించ లేదు . సమాజములో చతుర్వర్ణ వ్యవస్థను (కుల వ్యవస్థ) ఖండించారు.[2]
1930 వ సంవత్సరము లో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సామూహిక ఉద్యమం తో జెధే వంటి సమాజ్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు, దీనితో సత్య సమాజ్ కార్యకలాపాలు ఆగిపోయినవి.[3]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)