సనమ్ తేరీ కసమ్ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నరేంద్ర బేడీ |
---|---|
కథ | సురూర్ -సుభాష్ |
చిత్రానువాదం | సురూర్ -సుభాష్ |
తారాగణం | కమల్ హాసన్ రీనా రాయ్ కదర్ ఖాన్ రంజిత్ |
సంగీతం | రాహుల్ దేవ్ బర్మన్ |
సంభాషణలు | కదర్ ఖాన్ |
ఛాయాగ్రహణం | కాకా ఠాకూర్ |
కూర్పు | వామన్ భోంస్లే గురుదత్ శిరళి |
నిర్మాణ సంస్థ | రతన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | మే 21, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
సనమ్ తేరీ కసమ్ 1982, మే 21న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రతన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో నరేంద్ర బేడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, రీనా రాయ్, కదర్ ఖాన్, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం అందించాడు.[1][2][3]
ఈ చిత్రం హిందీలో 1982, మే 14న విడుదలయింది. ఈ చిత్రంలోని పాటలు అన్ని సూపర్ హిట్ అవడంతోపాటు, ఆర్.డి. బర్మన్ మొదటి ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్నాడు.[4]
ఈ చిత్రంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించడంతోపాటు, ఈ చిత్రంలోని ఒక పాటలో "యధువంశ సుధాంబుధి చంద్ర" సన్నివేశానికి నృత్య దర్శకత్వం వహించాడు.[5][6]