S/O సత్యమూర్తి | |
---|---|
దర్శకత్వం | త్రివిక్రం శ్రీనివాస్ |
రచన | త్రివిక్రం శ్రీనివాస్ |
నిర్మాత | ఎస్. రాధాకృష్ణ |
తారాగణం | అల్లు అర్జున్ ఉపేంద్ర ప్రకాష్ రాజ్ రాజేంద్ర ప్రసాద్ సమంత స్నేహ అదా శర్మ నిత్యా మీనన్ సంపత్ రాజ్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్[1] |
నిర్మాణ సంస్థ | హారిక & హాసిని క్రియేషన్స్ |
పంపిణీదార్లు | క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ (విదేశాలు)[2] శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (నైజాం)[3] |
విడుదల తేదీ | 9 ఏప్రిల్ 2015 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹400—500 million[a] |
సన్నాఫ్ సత్యమూర్తి 2015 ఏప్రిల్ 9, గురువారం విడుదలైన తెలుగు సినిమా. డి.వి.వి.దానయ్య, ఎస్.రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రం శ్రీనివాస్ రచనా దర్శకత్వంలో హారిక & హసిని క్రియేషన్స్ బేనర్‌పై నిర్మితమైంది. అల్లు అర్జున్, ఉపేంద్ర, సమంత, స్నేహ, అదా శర్మ, నిత్య మేనన్, రాజేంద్ర ప్రసాద్ నటించారు.[6]
దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహితులు, బంధువుల ఇళ్ళలో జరిగిన ముఖ్యమైన ఘటనలకు నాటకీయత జోడించి సినిమలోని ప్రధాన సన్నివేశాలు రాసుకున్నారు. వేగేశ్వరాపురంలోని తన అమ్మ మేనమామల జీవితాన్ని స్ఫూర్తిగా స్వీకరించి సినిమాలో ఎమ్మెస్ నారాయణ రావు రమేష్‌ల మధ్యన కీలకమైన ఘట్టాన్ని రాసినట్టు త్రివిక్రం వెల్లడించారు. ఆ కుటుంబంలో తన అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాల పాటు కలిసి ఉమ్మడిగా జీవించిన ఆ కుటుంబం వంటి నిజజీవితాంశాలు సినిమాలోని ముఖ్యకథ వెనుక ప్రేరణ.[7]
విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాష్ రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (వెన్నెల కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్ర ప్రసాద్(నటుడు)) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి మొదటి భాగం ముగుస్తుంది.
తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యా మీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ.[8]
ఈ చిత్రంలోని పాటల విడుదల సభకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు దాసరి నారాయణరావుతొలి సీడీని విడుదల చేసి అల్లు అరవింద్‌కు అందజేశారు.[9]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు