వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పాట్నా, బీహార్ | 1967 నవంబరు 14||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 2000 నవంబరు 10 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 నవంబరు 10 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1997 జనవరి 23 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 మే 30 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2018 జనవరి 16 |
సయ్యద్ సబా కరీం (జననం 1967 నవంబరు 14) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతను కుడిచేతి వాటం బ్యాటరు, వికెట్ కీపరు . కరీం కార్పొరేట్ రంగంలోనూ సేవలందించాడు. అతను టిస్కోలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేశాడు.
సబా జట్టు ప్రదర్శన గురించి, అంపైరింగ్ ప్రమాణాలు, డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు మొదలైన అనేక క్రికెట్ అంశాలపై తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పాడు.
సబా 13 సంవత్సరాల వయస్సులో అండర్ 19 పాట్నా జట్టుకు కెప్టెన్ అయ్యాడు. 1981లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ముంబైలో జరిగిన ఇండియా అండర్ 15 క్యాంపులో ఎంపికయ్యాడు
కరీం ఆ రోజుల్లో బీహార్ జట్టులో ఆడేవాడు. అది అంత బలమైన జట్టు కానందున, అంతగా గుర్తింపు రాలేదు. అంచేత అతను టెస్టుల్లో ప్రవేశించడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. అతని కీపింగ్, బ్యాటింగ్ సునీల్ గవాస్కర్ వంటి వారి ప్రశంసలు పొందింది. ఎట్టకేలకు పదేళ్ళ తరువాత కరీం భారత జట్టుకు ఎంపికయ్యాడు.
పాట్నాలోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన వెంటనే కరీం 15 సంవత్సరాల వయస్సులో 1982–83లో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. 1990-91 రంజీ ట్రోఫీలో ఒరిస్సాపై 234 పరుగులు చేయడం అతని కెరీర్-బెస్ట్ స్కోరు.[1] 1996-97లో దక్షిణాఫ్రికాలో జరిగిన స్టాండర్డ్ బ్యాంక్ సిరీస్‌లో నయన్ మోంగియాకు ప్రత్యామ్నాయంగా భారతజట్టు లోకి మొదటిసారి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లో 55, ఆ తరువాతి మ్యాచ్‌లో 38 పరుగులు చేసి గుర్తింపు పొందాడు. అయితే అతని తదుపరి ఎనిమిది ఇన్నింగ్స్‌లో అతను 49 పరుగులే చేశాడు.
2000 మేలో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టులో తరపున కీపింగు చేస్తూండగా కంటికి గాయమైంది. దాంతో అతని క్రీడాజీవితం దాదాపు ముగిసింది.[2] అయితే, ఆ తరువాత 2000 నవంబరులో బంగ్లాదేశ్‌పై కూడా ఒక టెస్టు ఆడాడు [3]
2018 జనవరి 1న, BCCI, సబా కరీమ్‌ను క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా నియమించింది. అతని ప్రధాన బాధ్యతలు క్రికెట్ విభాగానికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడం, కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం, బడ్జెట్‌ను రూపొందించడం, మ్యాచ్ ఆడే నిబంధనలు, వేదికల ప్రమాణాలు, దేశీయ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహణకు అనుగుణంగా ఉండేలా చూడడం, పర్యవేక్షించడం.[4] సబాతో పాటు, మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ పేరు కూడా ఆ స్థానానికి పరిశీలించారు.
2012 సెప్టెంబరు 27న సబా కరీం ఈస్ట్ జోన్ నుండి జాతీయ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[5]
2019 సెప్టెంబరులో, యాంటీ-డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వి చేసే U-16 ఆటగాళ్ల వయస్సు-నిర్ధారణ పరీక్ష ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు బీహార్ క్రికెట్ అసోసియేషన్ కరీమ్‌కు నోటీసు పంపింది. BCA చీఫ్ ప్రకారం, BCA అనర్హత కమిటీ కొందరు ఆటగాళ్లను పరీక్షించిన తర్వాత కరీం, ఆ తనిఖీలను ఆపించాడు. BCA చీఫ్ ఇలా వ్యాఖ్యానించాడు - "మీరు BCCIలో క్రికెట్ ఆపరేషన్స్ జిఎమ్‌గా ఉన్నారని మీరు మరచిపోకూడదు. పై చర్యలను బట్టి మీరు, బీహారుకు చెందిన ప్రతిభను అనర్హులుగా ఉన్న కమిటీ అణగదొక్కడాన్ని అనుమతించడానికి మొగ్గు చూపుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మీరు బీహార్ రాజకీయాలలో పాల్గొనడం మానుకోవాలి. అలాంటి చర్యలు చేపట్టవద్దని ఈ లీగల్ నోటీసు ద్వారా నేను మిమ్మల్ని అభ్యర్థించాలనుకుంటున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కాదని కూడా మీరు మర్చిపోకూడదు" [6]
2020 జనవరిలో, సబా కరీం కుమారుడు ఫీడెల్ సబా తన కారుతో ఒక స్త్రీని ఢీకొట్టినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు.[7]
2019 అక్టోబరులో, సౌరవ్ గంగూలీ పట్టుబట్టినప్పటికీ, వివిధ దేశీయ మ్యాచ్‌ల కోసం తగినంత గులాబీ బంతులను ఏర్పాటు చేయలేదని సబా కరీమ్‌పై విమర్శలు వచ్చాయి. ఒక కార్యనిర్వాహకుడు ఇలా అన్నాడు - "మనం రంజీ ట్రోఫీ లేదా ఇరానీ కప్‌లో నాకౌట్‌ల లాంటి దేశీయ మ్యాచ్‌లను లైట్ల కింద ఆడించేలా కరీం చర్యలు తీసుకుని ఉంటే, మాకు తగినన్ని బంతులు సిద్ధంగా ఉండేవి. కానీ అతను ఈ ఆలోచనను డిక్కీలో తోసేసాడు. ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అంచేతనే ఇప్పుడు దాదాపు 48 బంతులను అవసరం కాగా - రెండు జట్లకు, మ్యాచ్ అధికారులకు తదితరులకు - మేం వాటిని ఎక్కడ నుంచి తేవాలి? ఒక 34 ఓవర్ల తర్వాత బంతిని మైదానం బైట పడేలాగా కొడితే, వేరే బంతి ఎట్లా తేవాలి? దాదాపుగా అంతే స్థాయిలో అరిగిన బంతి కావాలి. ఎక్కడ నుండి తెస్తాం దాన్ని?" [8]
2019 అక్టోబరు నుండి, మహిళల జాతీయ జట్టు సహాయక సిబ్బందిని రాజ్యాంగ విరుద్ధంగా నియమించారని CoA సభ్యురాలు డయానా ఎడుల్జీ, BCCI కొత్త అపెక్స్ కౌన్సిల్ సభ్యురాలు శాంత రంగస్వామి సబాపై ఆరోపణలు చేసారు. జాతీయ మహిళా జట్టు కోసం వీడియో విశ్లేషకుల పోస్ట్ కోసం అభ్యర్థులను శుక్రవారం ఇంటర్వ్యూ చేశారని, ప్రస్తుత విశ్లేషకుడు పుష్కర్ సావంత్‌ను ఇప్పటికే కరీం నామినేట్ చేసినప్పటికీ ఈ ఇంటర్వ్యూలు చేసారనీ, సెలెక్టర్లకు ఈ సమాచారం ఇవ్వలేదనీ ఎడుల్జీ BCCI CEOకి పంపిన ఈమెయిల్‌లో రాసింది.[9]