సమాజ్‌వాది జనతా పార్టీ | |
---|---|
స్థాపకులు | చంద్రశేఖర్ |
స్థాపన తేదీ | 5 నవంబరు 1990 |
రద్దైన తేదీ | 2020 |
ప్రధాన కార్యాలయం | నరేంద్ర నికేతన్, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూ ఢిల్లీ |
యువత విభాగం | ఆల్ ఇండియా సోషలిస్ట్ యూత్ కౌన్సిల్ |
రాజకీయ విధానం | సోషలిజం లౌకికవాదం |
రంగు(లు) | ఆకుపచ్చ |
ఎన్నికల కమిషను స్థితి | రాష్ట్ర పార్టీ |
కూటమి |
|
Election symbol | |
![]() |
సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ) లేదా జనతాదళ్ (సోషలిస్ట్) అనేది భారతీయ రాజకీయ పార్టీ. 1990-91లో భారతదేశ 8వ ప్రధానమంత్రి అయిన చంద్ర శేఖర్ ఈ పార్టీని స్థాపించాడు. 2007 జూలై 8న ఆయన మరణించే వరకు పార్టీకి నాయకత్వం వహించాడు.
చంద్ర శేఖర్ మరణించే సమయానికి పార్టీకి ఏకైక లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. జనతాదళ్ నుండి చంద్ర శేఖర్, దేవి లాల్ విడిపోయినప్పుడు 1990 నవంబరు 5న పార్టీ స్థాపించబడింది. పార్టీ 60 మంది ఎంపీలను కూడగట్టుకుని ఏడు నెలల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.[1]
1994 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 1993లో రాష్ట్ర యూనిట్ జనతాదళ్‌లో విలీనం అయ్యేవరకు ఎస్.ఆర్. బొమ్మై కర్ణాటక రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.[2]
2012 నాటికి, చంద్ర శేఖర్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రి కమల్ మొరార్కా పార్టీ అధినేత. పార్టీ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఐటిఓ ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లోని నరేంద్ర నికేతన్‌లో ఉంది.[3]
2015 ఏప్రిల్ 14న సమాజ్‌వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ), జనతాదళ్ (యునైటెడ్), జనతాదళ్ (సెక్యులర్), రాష్ట్రీయ జనతాదళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీని ఎదిరించే క్రమంలో తాము కొత్త జాతీయ కూటమి జనతా పరివార్ లో విలీనమవుతామని ప్రకటించాయి.[4]