లిసాన్-ఉల్-ముల్క్ సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి | |
---|---|
![]() | |
జననం | 9 ఆగస్టు 1909 హైదరాబాదు, దక్కను |
మరణం | 5 అక్టోబరు 1985 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రచయిత, జర్నలిస్టు, కవి, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు, విద్యావేత్త అంరియు రాజకీయవేత్త |
వీటికి ప్రసిద్ధి | ఒన్ నేషన్ థియరీ, యునైటెడ్ ఇండియా |
గుర్తించదగిన సేవలు | Tanqid-i-Qamus-ul-Mashahir, Usman-Namah :16 May 1934 , Memoirs of Chand Bibi :Avant-Propos by M.Edmond Gaudart, Azeem mujahid e Azadi Pandit Jawaharlal Nehru 1942 , Fateh Azadi 1947 , Hind Nama : 15 August 1949, Jawahar Nama 1950, Bahadur Nama : a humble tribute in 62 stanzas to Shri Lal Bahadur Shastri March 1965, Muguam-e-Ghalib:1969, Paayam e Gandhi(Message of Mahatma Gandhi )100 stanzas 24 December 1969 released by Khan Abdul Ghaffar Khan, Indira Nama 1970, 25 years of India's progress 1973. |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లిదండ్రులు | సయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి (తండ్రి) |
పురస్కారాలు | పద్మశ్రీ |
సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి ( 1909 ఆగస్టు 9 – 1985 అక్టోబరు 5) (లిసాన్-ఉల్-ముల్క్ గా సుపరిచితుడు) భారతీయ రచయిత, [1][2] విమర్శకుడు, ఛీఫ్ ఎడిటర్, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రాజకీయవేత్త, హైదరాబాదు ప్రముఖుడు. ఆయన "లుట్‌ఫుదుల్లా ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్" యొక్క అధ్యక్షులుగా తన సేవలనందించాడు.[3] ఆయన హైదరాబాదు జర్నలిస్టు అసోసియేషన్ అద్యక్షులుగా కూడా ఉన్నాడు.[4] ఆయన ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ కౌన్సిల్ సభ్యుడు.[5]
ఖాద్రి 1966 లో భారతదేశ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సాహిత్యం, విద్యలో చేసిన కృషికి గానూ ఈ పురస్కారం వరించింది.[6] ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడుగా కూడా ఉన్నాడు.[7] ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజ్ కమిటీకి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు.ఆయన ఉర్దూ దినపత్రికలైన అయిన సల్తానత్, పైసా అక్బర్ కు ఛీఫ్ ఎడిటరుగా కూడా పనిచేసాడు. అంతకు ముందు ఆయన తండ్రి 1929లో స్థాపించిన తరిఖ్ పబ్లికేష్న్స్ కు ఎడిటరుగా కూడా ఉన్నాడు.[8]
ఆయన హైదరాబాదు రాష్ట్రంలో 1909 ఆగస్టు 9లో అల్లామా హకీం సయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి, సయ్యిదా మహబూబ్ బేగం ఖాద్రి దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబం సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధమైనది. ఆయన సహోదరులలో పెద్దవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు. వారు సయ్యద్ ఇమ్‌దదుల్లా ఖాద్రి, సయ్యిద్ సాడుల్లా ఖాద్రి. ఆయన తంద్రి అల్లామా సయ్యద్ షామ్‌సుల్లా ఖాద్రి కూడా అనేక పుస్తకాలను రచించారు.[9][10][11][12] ఆయన దక్కనీయత్ యొక్క మొదటి పరిశోధకుడు.[13]
1946లో ఖాద్రి హైరదాబాద్ రాష్ట్రానికి మొదటి జర్నలిస్టు. ఆయన ఉర్దూ దినపత్రిక "సల్తానత్"లో ఒకే జాతి సిద్ధాంతం పై రచననలు చేసేవాడు.
{{cite book}}
: |work=
ignored (help)
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: date and year (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)