సయ్యద్ నయీముద్దీన్ (2016) | |||
వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
జనన తేదీ | 1944 (age 80–81) | ||
జనన ప్రదేశం |
హైదరాబాదు తెలంగాణ భారతదేశం | ||
ఆడే స్థానం | డిఫెండర్ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
1962–1966 | హైదరాబాదు నగర పోలీసు | ||
1966–1968 | తూర్పు బెంగాల్ | ||
1968–1970 | మోహన్ బగన్ | ||
1970 | తూర్పు బెంగాల్ | ||
1971–1973 | మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ | ||
1973–? | మోహన్ బగన్ | ||
197?–? | మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ | ||
జాతీయ జట్టు | |||
1964–1971 | భారత ఫుట్‌బాల్ జట్టు | ||
Teams managed | |||
1982–1985 | మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ | ||
1986 | భారత ఫుట్‌బాల్ జట్టు | ||
1990–1992 | తూర్పు బెంగాల్ | ||
1992–1994 | మోహన్ బగన్ | ||
1994–1996 | తూర్పు బెంగాల్ | ||
1997–1998 | భారత ఫుట్‌బాల్ జట్టు | ||
2004–2005 | మహీంద్రా యునైటెడ్ | ||
2005–2006 | భారత ఫుట్‌బాల్ జట్టు | ||
2007–2016 | బ్రదర్స్ యూనియన్ | ||
2016 | బ్రదర్స్ యూనియన్ | ||
2017 | ఢాకా మహమ్మదన్ | ||
2018–2019 | బ్రదర్స్ యూనియన్ | ||
|
సయ్యద్ నయీముద్దీన్ (జననం 1944), నయీమ్[1][2] తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్, మాజీ ఆటగాడు. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు.[3] మహీంద్రా యునైటెడ్,[4] బ్రదర్స్ యూనియన్, ఢాకా మహమ్మదన్,[5] బంగ్లాదేశ్ జాతీయ జట్టును నిర్వహించాడు. అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు రెండింటినీ గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడు ఇతడు. భారత ఫుట్‌బాల్‌కు చేసిన కృషిని గుర్తించి 1997లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును,[6] ఫుట్‌బాల్ కొరకు ద్రోణాచార్య అవార్డులను బహుకరించింది.
1970 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[7]
1997లో నయీముద్దీన్ భారత కోచ్‌గా నియమించబడ్డాడు. 5–1తో మాల్దీవుల జట్టును ఓడించి దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్‌ను గెలుచుకోవడమేకాకుండా మొదటిసారి నెహ్రూ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు.[8] 1998 ఆసియా క్రీడలకు ముందు 1997 సెప్టెంబరు నుండి 1998 నవంబరు మధ్య ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండా జాతీయ జట్టు బాధ్యతలు నిర్వర్తించాడు. 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో జట్టును నిర్వహించాడు, ఆ టౌర్నమెంటులో భారత జట్టు రెండవ రౌండ్‌కు చేరుకుంది.[9][10]
1998 డిసెంబరులో ఆటల తర్వాత ఇతడు కోచ్ గా చేయలేదు. 2005లో భారత కోచ్‌గా సుఖ్వీందర్ సింగ్ నియమించబడగా, ఇతడు రెండవ స్థానంలో ఉన్నాడు.[11] 2006లో ఆసియా కప్‌కు అర్హత సాధించినప్పుడు జపాన్, యెమెన్‌పై సరిగా ఆడకపోవడంతో 2006లో కోచ్ పదవి నుండి నిష్క్రమించాడు.[3] 2007 నుండి 2017 వరకు, ఢాకాలోని బ్రదర్స్ యూనియన్ ప్రధాన కోచ్ గా ఉన్నాడు. గతంలో ముంబై ఫుట్‌బాల్ లీగ్‌లో బెంగాల్ ముంబై ఎఫ్.సి. జట్టును నిర్వహించాడు.[12]