ఎస్.ఎం.ఆరిఫ్ సాహబ్ | |
---|---|
జననం | హైదరాబాదు | 1944 జనవరి 29
జాతీయత | భారతీయుడు |
వృత్తి | బాడ్మింటన్ కోచ్ |
సయ్యద్ మహ్మద్ ఆరిఫ్ (1944 జనవరి 29) బ్యాడ్మింటన్ కోచ్. అతను అరిఫ్ సాహెబ్ గా సుపరిచితుడు. అతని సేవలకు గానూ భారతప్రభుత్వము పద్మశ్రీ, ద్రోణాచార్య పురస్కారములచే సత్కరించింది.[1] గోపీచంద్,చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల,సైనా నెహ్వాల్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ పొందారు[1].
ఎస్.ఎం.ఆరిఫ్ తెలంగాణా లోని హైదరాబాదుకు చెందినవాడు. అతను హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి బి.యస్సీ చేసాడు. అతను అన్వర్ ఉల్ ఉలూం కాలేజీ నిర్వహిస్తున్న క్రికెట్ జట్టులో నాలుగు సంవత్సరాల పాటు ఆడాడు. తరువాత హెచ్.సి.ఎ. లీగ్ లో దకన్ బ్లూస్ కోరకు ఆడాడు.[2] తరువాత అతను తన క్రికెట్ కోచ్ పక్కనపెట్టి బ్యాడ్మింటన్ ను అనుసరించాడు.
S. M. ఆరిఫ్, తన కళాశాల రోజుల్లో, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఇంటర్-వర్సిటీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అతను అనేక జాతీయ టోర్నమెంట్లలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
పాటియాలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుండి బ్యాడ్మింటన్ కోచింగ్‌లో డిప్లొమా సంపాదించాడు. 1974 లో అతను బ్యాడ్మింటన్ కోసం జాతీయ శిక్షకుల ప్యానెల్‌లో చేరాడు[3]. 1997 లో నేషనల్ చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్‌గా నియమించబడ్డాడు. మాజీ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపిచంద్, మాజీ భారత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ పి. వి. వి. లక్ష్మి, జ్వాలా గుత్తా, సైనా నెహ్వాల్ సహా పలువురు భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు ఆరిఫ్ శిక్షణ ఇచ్చాడు.