సరూర్‌నగర్ చెరువు | |
---|---|
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°21′21″N 78°31′38″E / 17.35584°N 78.52714°E |
రకం | సహజ చెరువు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 99 ఎకరాలు (40 హెక్టార్లు) |
గరిష్ట లోతు | 6.1 మీటర్లు (20 అడుగులు) |
ప్రాంతాలు | హైదరాబాద్ |
సరూర్‌నగర్ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్ సమీపంలోవున్న చెరువు.[1] 16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో తాగునీటి అవసరాలకు, పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్ చెరువు కట్టించబడింది.
హైదరాబాదులోని ఐదు ప్రధాన జలాశయాలలో ఒకటైన ఈ సరూర్‌నగర్ చెరువు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది 99 ఎకరాల విస్తీర్ణం (40 హెక్టార్లు) లో 6.1 మీటర్లు (20 అడుగులు) గరిష్ఠ లోతు కలిగివుంది.
2001 నుండి ఈ చెరువులో నిమజ్జనానికి శ్రీకారం చుట్టారు. 2004 నుండి కేన్లు అందుబాటులోకి తెవడంతో అప్పటినుండి భారీ విగ్రహాల్ని ఇక్కడే నిమజ్జనం చేయడం మొదలుపెట్టారు.[2]
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కులో ఏర్పాటుచేసిన సరూర్ నగర్ చెరువు బోటింగ్ కేంద్రాన్ని 2021, డిసెంబరు 23న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. 4 నూతన బోటులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]