సరోష్ హోమీ కపాడియా | |||
జస్టిస్ సరోష్ హోమీ కపాడియా | |||
పదవీ కాలం 12 మే 2010 – 28 సెప్టెంబరు 2012 | |||
ముందు | కె.జి.బాలకృష్ణన్ | ||
తరువాత | ఆల్టామస్ కబీర్ | ||
ప్రధాన న్యాయమూర్తి, ఉత్తరాఖండ్ హైకోర్టు
| |||
పదవీ కాలం 5 ఆగష్టు 2003 – 17 డిసెంబరు 2003 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, భారతదేశం | 1947 సెప్టెంబరు 29||
మరణం | 2016 జనవరి 4 ముంబై, భారతదేశం | (వయసు 68)||
జీవిత భాగస్వామి | షహనాజ్ | ||
మతం | జొరాస్ట్రియన్ మతము[1] |
సరోష్ హోమీ కపాడియా (ఎస్.హెచ్.కపాడియా) (29 సెప్టెంబరు 1947 – 4 జనవరి 2016) భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి.[2][3][4][5]
ఎస్.హెచ్.కపాడియా ముంబైలో 1947లో జన్మించారు.[6] ఆసియా ఖండంలో ప్రాచీన న్యాయకళాశాల అయిన ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబైలో గ్రాడ్యుయేషన్ చేసారు. నగరంలోని ప్రభుత్వ లా కళాశాలలో పట్టా పొందాక కొంతకాలం క్లర్కుగా పనిచేశారు. క్లాస్-4 ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రముఖ కార్మిక న్యాయవాది అయిన ఫిరోజ్ దమానియా వద్ద చేరారు. తరువాత 1974 సెప్టెంబరు 10 న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు.
కపాడియా అక్టోబరు 8, 1991, మార్చి 23, 1993 లలో బొంబాయి హైకోర్టులో అదనపు జడ్జిగా నియమింపబడ్డారు. ఆగష్టు 5, 2003 న ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్దారు. డిసెంబరు 18, 2003 న ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.[6] మే 8, 2010 న భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆయనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సెప్టెంబరు 29, 2012 న పదవీవిరమణ చేసారు. ఈ కాలంలో ఆయన గుజరాత్ న్యాయ విశ్వవిద్యాలయంలో జనరల్ కౌన్సిల్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.[7]
ఆయన సెర్నాజ్ ను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఛార్టెడ్ అకౌంటెంత్ గా పనిచేస్తున్నారు. కపాడియాకు ఆర్థికశాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్, ప్రాయోగిక భౌతిక శాస్త్రం, హిందూ, భౌద్ధ తత్వాల పై మక్కువ ఎక్కువ.[6] ఆయన జనవరి 4, 2016 న మరణించారు.[8]
సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా విలువలున్న సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ఉండేవారు.
వోడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు లాంటివి జస్టిస్ కపాడియా హయాంలోనే వెలువడ్డాయి.[9]
జడ్జిగా ఎలాంటి శషభిషలకు తావులేకుం డా ఆయన అనేక కీలక తీర్పులు వెలువరించారు. యూపీఏ హయాంలో 2011 లో సీవీసీగా పీజే థామస్ నియామకం చెల్లదని పేర్కొంటూ జస్టిస్ కపాడియా తీర్పు చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ బెయిల్ రద్దు కేసులో ధర్మాసనంలోని మెజారిటీ జడ్జీలతో విభేదిస్తూ.... తీర్పు వెలువరించిన సాహసి.[10]
3207 రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన 834 తీర్పులు, ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో ముఖ్యమైన తీర్పులను వెలువరించి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న పేరు పొందారు.[11]
Top legal luminary and former Supreme Court chief justice Sarosh Homi Kapadia passed away late on Monday, a family member said.