సర్ హెన్రీ రస్సెల్, బారొనెట్ | |
---|---|
జననం | మూస:Birthdate |
మరణం | 19 ఏప్రిల్ 1852 స్వాలోఫీల్డ్ పార్క్ | (aged 68)
వృత్తి | దౌత్యవేత్త |
భార్య / భర్త | జేన్ అమీలియా కాసమయోర్
(m. invalid year; మరణం 1808)మరీ క్లొటిల్డె దె లాఫాంటేన్
(m. invalid year; మరణం 1852) |
పిల్లలు | సర్ చార్లెస్ రస్సెల్, మూడవ బారోనెట్, సర్ జార్జ్ రస్సెల్, నాలుగవ బారోనెట్ తో సహా ఏడుగురు |
తల్లిదండ్రులు | సర్ హెన్రీ రస్సెల్, మొదటి బారోనెట్ ఆన్న్ బార్బరా విట్‌వర్త్ |
బంధువులు | సర్ చార్లెస్ విట్‌వర్త్ (తాత - అమ్మ వైపు నుండి) చార్లెస్ విట్‌వర్త్, మొదటి అర్ల్ ఆఫ్ విట్‌వర్త్ (మేనమామ) |
సర్ హెన్రీ రస్సెల్, రెండవ బారోనెట్ (27 మే 1783-19 ఏప్రిల్ 1852) ఒక ఆంగ్ల దౌత్యవేత్త, భూస్వామి. 1810 నుండి 1820 వరకు హైదరాబాదు రాజ్యంలో బ్రిటీషు రెసిడెంటుగా పనిచేశాడు.
రస్సెల్, 1783 మే 27న జన్మించాడు. ఈయన సర్ హెన్రీ రస్సెల్, మొదటి బారోనెట్, ఆయన రెండవ భార్య ఆన్న్ బార్బరా విట్‌వర్త్ యొక్క పెద్ద కుమారుడు.[1] ఈయన తోబుట్టువులలో చార్లెస్ రస్సెల్ (రెడింగ్ స్థానానికి పార్లమెంటు సభ్యుడు), ఫ్రాన్సిస్ విట్‌వర్త్ రస్సెల్ (జేన్ ఆన్న్ కేథరీన్ బ్రోడీ పెళ్లి చేసుకున్నాడు), రెవరెండ్. విట్‌వర్త్ రస్సెల్ (ఫ్రాన్సిస్ కార్పెంటర్‌ను వివాహం చేసుకున్నాడు), జార్జ్ లేక్ రస్సెల్ (మొదటి అర్ల్ ఆఫ్ లిమరిక్ కూతురు, లేడీ కారోలైన్ పెరీని వివాహం చేసుకున్నాడు), హెన్రియెట్టా రస్సెల్ (విట్టింగ్‌టన్ హాల్‌కు చెందిన థామస్ గ్రీన్‌ను వివాహం చేసుకున్నది) ఉన్నారు.[2][3][3]
ఈయన తండ్రి యొక్క తల్లితండ్రులు డోవర్‌కు చెందిన మైఖేల్ రస్సెల్, హాన్నా హెన్షా (హెన్రీ హెన్షా కుమార్తె). ఈయన తల్లి సర్ చార్లెస్ విట్‌వర్త్ యొక్క ఐదవ కుమార్తె. హెన్రీ రస్సెల్ మేనమామ చార్లెస్ విట్‌వర్త్, విట్‌వర్త్ యొక్క మెదటి అర్ల్.[3]
1798 నుండి 1805లో మరణించే వరకు హైదరాబాదు, బేరార్ ను పాలించిన నిజాం ఆస్థానంలో బ్రిటిష్ రెసిడెంటు అయిన జేమ్స్ అఖిల్స్ కర్క్‌పాట్రిక్ వద్ద రస్సెల్ ఆంతరంగిక కార్యదర్శిగానూ, సహాయకుడిగానూ పనిచేశాడు. విలియం డాల్రింపుల్ రాసిన 2002 నాటి బ్రిటిష్ ఇండియా చరిత్ర, వైట్ మొఘల్స్ గ్రంథాలలో రస్సెల్ వృత్తి జీవితం గురించి కొంత వివరంగా చర్చించబడింది. అందులో ఈయన ప్రతిభావంతుడు కానీ బలహీనమైన దౌత్యవేత్తగా చిత్రీకరించబడ్డాడు. రస్సెల్ కర్క్‌పాట్రిక్ వితంతువు, హైదరాబాదీ కులీన మహిళ అయిన ఖైరున్నీసాను ఆకర్షించాడు, కానీ కొంతకాలం తర్వాత ఆమెను విడిచిపెట్టాడు.[4][5] ఆ తరువాత ఈయన 1809లో పూణేలోని పేష్వా ఆస్థానానికి స్వయానా రెసిడెంటుగా నియమించబడ్డాడు. ఆ తరువాత సంవత్సరం, ఇంతకు క్రితం కర్క్‌పాట్రిక్ పదవైన, హైదరాబాదులోని బ్రిటీషు రెసిడెంటుగా పదోన్నతి పొందాడు. 1810 నుండి 1820 వరకు ఆ హోదాలో పనిచేశాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు తలెత్తినపుడు, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిగి, అవమానకరంగా పదవినుండి తొలగించబడటాన్ని నివారించడానికి రస్సెల్ రాజీనామా చేశాడు. £3,400 వార్షిక జీతంతో, ఈయన 10 సంవత్సరాలలో £85,000 సంపదను కూడగట్టగలిగాడు.[4] పదవీ విరమణ తర్వాత ఈయన మొదట బెడ్‌ఫోర్డ్‌షైర్లోని సట్టన్ పార్కులో, ఆ తరువాత ఎక్సెటర్లోని నిర్మాణశైలిపరంగా గుర్తించదగిన జాబితాలో నమోదు చేయబడిన భవనం అయిన సదరన్‌హే హౌస్లో నివసించాడు. ఇది స్తంభాలతో కూడిన వైభవంతో, కొత్తగా నిర్మించిన, స్వతంత్రంగా ఉన్న, సాంప్రదాయక భవనం. [4]
1820లో రస్సెల్ కుటుంబం, ఆయన తండ్రి మొదటి బారోనెట్‌తో పాటు, ఆయన ఇద్దరు అత్యంత సంపన్నవంతమైన కుమారులు, చార్లెస్, సర్ హెన్రీ (తరువాత రెండవ బారోనెట్) వారి వనరులను సమీకరించి, బర్క్‌షైర్లోని రెడింగ్‌కు సమీపంలో ఉన్న స్వాలోఫీల్డ్ పార్కును కొనుగోలు చేశారు. అక్కడ వారు, వారి వారసులు 150 సంవత్సరాలకు పైగా నివసించారు.[6]
హైదరాబాద్ బ్యాంకింగ్ సంస్థ అయిన పామర్ అండ్ కంపెనీ తరపున భారత గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పాక్షికంగా వ్యవహరించారని ఆరోపించిన అవినీతి కుంభకోణంలో, హెన్రీ రస్సెల్, ఆయన సోదరుడు చార్లెస్ రస్సెల్ (1786-1856) చిక్కుకున్నారు. స్థానిక యువరాజులకు రుణాలు ఇవ్వడంపై నిషేధం నుండి ఈ సంస్థను మినహాయించాలని 1816లో హేస్టింగ్స్ తీసుకున్న నిర్ణయం ద్వారా, ఈ సంస్థ నేరుగా హైదరాబాద్ నిజాం మీర్ అక్బరు అలీ ఖాన్ తో జరిపిన లావాదేవీలలో రస్సెల్స్ సోదరుల ప్రమేయం ఉండి, లాభం పొందారని కనుగొనబడింది. హెన్రీ రస్సెల్ తర్వాత ఆయన పదవిని చేపట్టిన సర్ చార్లెస్ మెట్‌కాఫ్ 1820లో మోసపూరితంగా కల్పించిన రుణాన్ని కనుగొన్నాడు.[7][8][9]
1808 అక్టోబరులో రస్సెల్ మద్రాసులో జాన్ కాసమజోర్ కుమార్తె జేన్ అమీలియా కాసమజోర్‌ను వివాహం చేసుకున్నాడు. వారు వివాహం చేసుకున్న రెండు నెలలకే జేన్ అకస్మాత్తుగా మరణించింది.
1816 నవంబరు 13న, ఈయన ఫ్రెంచి కాథలిక్ అయిన మేరీ క్లొటిల్డే మోట్టె దె లాఫాంటేన్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె బెన్వా మోట్టె దె లాఫాంటేన్, బారన్ ఫీఫ్ దె సెయింట్ కార్నెయిల్, పాండిచ్చేరి చివరి ఫ్రెంచి గవర్నర్ కుమార్తె. ఫ్రెంచి రాజరిక బాలబాలికల అధికారిక నర్సు, ముఖ్యంగా 1785 నుండి 1792 వరకు <i id="mwTw">డాఫిన్</i> బాధ్యత వహించిన, అగాథే దే రాంబౌద్, ఈమెకు సమీప బంధువు.[10] మేరీ క్లొటిల్డేతో హెన్రీ రస్సెల్ ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వారు:
సర్ హెన్రీ 1852 ఏప్రిల్ 19న స్వాలోఫీల్డ్లో మరణించాడు. ఈయన తరువాత ఈయన పెద్ద కుమారుడు, చార్లెస్, అధికార బాధ్యతలు స్వీకరించాడు.[12] 1883లో చార్లెస్ అవివాహితుడిగా మరణించిన తరువాత, వంశానుగుణంగా సంక్రమించే బారోనెట్ పదవి, సర్ హెన్రీ యొక్క జీవించి ఉన్న కుమారుల్లో ప్జార్జ్ కు బదిలీ చేయబడింది.
తన మొదటి భార్య మరణించిన తరువాత, తన రెండవ భార్యతో వివాహానికి ముందు, రస్సెల్ ఒక స్థానిక మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు, దీని ఫలితంగా ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు 1815లో మేరీ విల్సన్ అని పేరు పెట్టాడు. హెన్రీ రస్సెల్ పదవీ విరమణ పొందిన తర్వాత, ఈ అమ్మాయిని ఇంగ్లాండుకు తీసుకుని వచ్చి, చాలా గోప్యంగా పెచ్చి పెద్దచేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సర్ హెన్రీ స్నేహితుడు మేజర్ రాబర్ట్ పిట్మన్ మధ్యవర్తిగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించాడు. హెన్రీ రస్సెల్ ఆమెకు క్రమం తప్పకుండా భత్యం అందేలా చూశాడు, కానీ మేజర్ పిట్మన్‌కు, ఆమె తండ్రి గుర్తింపును ఆమెకు చెప్పడానికి నిరాకరించాడు. మేరీ 1839లో రెవరెండ్ విలియం లాంగ్స్టన్ కాక్స్‌హెడ్‌ను వివాహం చేసుకున్నది. ఆయన ఎసెక్స్‌లోని కిర్బీ లే సోకెన్‌కు అధిపతిగా ఉన్నాడు.[13]