సర్కస్ దర్శకత్వం రోహిత్ శెట్టి స్క్రీన్ ప్లే యూనుస్ సాజవల్ నిర్మాత
రోహిత్ శెట్టి
భూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
తారాగణం ఛాయాగ్రహణం జొమోన్ టీ. జాన్ కూర్పు బంటీ నాగి సంగీతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలేపాటలు: దేవి శ్రీ ప్రసాద్ హితేన్-బాదుషా లిజో జార్జ్-డీజే చేతస్నిర్మాణ సంస్థలు
రోహిత్ శెట్టి ప్రొడక్షన్
టీ-సిరీస్
పంపిణీదార్లు రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్ విడుదల తేదీ
23 డిసెంబరు 2022 (2022-12-23 ) సినిమా నిడివి
138 నిముషాలు [ 1] దేశం భారతదేశం భాష హిందీ బడ్జెట్ ₹150 కోట్లు[ 2] బాక్సాఫీసు అంచనా ₹61.5 కోట్లు
సర్కస్ 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. రణ్వీర్ సింగ్ , జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , పూజా హెగ్డే ,[ 3] వరుణ్ శర్మ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 2న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 23న విడుదల చేశారు.
రణ్వీర్ సింగ్ - రాయ్ చౌహాన్, రాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - బిందు చౌహాన్, రాయ్ షెనాయ్ స్నేహితురాలు
పూజా హెగ్డే - మాలా చౌహాన్, రాయ్ చౌహాన్ భార్య[ 4]
వరుణ్ శర్మ - జాయ్ చౌహాన్, జాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
మురళి శర్మ - డా. రాయ్ జమ్నాదాస్
సంజయ్ మిశ్రా - రాయ్ బహదూర్, బిందు తండ్రి
అశ్విని కల్సేకర్ - శకుంతల షెనాయ్, రాయ్ షెనాయ్, జాయ్ షెనాయ్ తల్లి
జానీ లీవర్ - పోల్సన్ దాదా
సిద్ధార్థ జాదవ్ - మోమో
అభినయ్ రాజ్ సింగ్ - అంకిత్, పోల్సన్ దాదా కొడుకు
ముఖేష్ తివారీ- డాకు బగీరా
రాధికా బంగియా- లిల్లీ
వ్రజేష్ హిర్జీ- నాగ్ మణి, టాక్సీ డ్రైవర్
టికు తల్సానియా- వెల్జీభాయ్, నగల వ్యాపారి
విజయ్ పాట్కర్- శంకర్
బ్రిజేంద్ర కాలా- యూసుఫ్
అనిల్ చరణ్‌జీత్- ప్రేమ్
ఉదయ్ టికేకర్ - జాయ్ జమ్నాదాస్
సులభ ఆర్య- చచ్చి
ఉమాకాంత్ పాటిల్- చిక్కీ
ఆశిష్ వరంగ్- మామిడి
నికితిన్ ధీర్ - దేవ్ చౌహాన్, రాయ్ చౌహాన్, జాయ్ చౌహాన్ దివంగత తండ్రి (అతిధి పాత్ర)
దీపికా పదుకొణె - బృందామ ("కరెంట్ లగా రే" పాటలో)