సర్ఫరాజ్ ఆలం | |||
పదవీ కాలం 14 మార్చి 2018 – 23 మే 2019 | |||
ముందు | మహ్మద్ తస్లీముద్దీన్ | ||
---|---|---|---|
తరువాత | ప్రదీప్ కుమార్ సింగ్ | ||
నియోజకవర్గం | అరారియా | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2010 – 2019 | |||
పదవీ కాలం 1996 – 2005 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | మహ్మద్ తస్లీముద్దీన్, అఖ్తరీ బేగం | ||
నివాసం | అరారియా |
సర్ఫరాజ్ ఆలం భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018లో బీహార్ రాష్ట్రంలోని అరారియా నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
సర్ఫరాజ్ ఆలం తన తండ్రి మాజీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1996లో జోకిహాట్ శాసనసభ నియోజకవర్గం నుండి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 2000లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత 2010, 2015 ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
సర్ఫరాజ్ ఆలంను జనవరి 2016లో, రైలులో ఒక జంటతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పార్టీ అతడిని ఆర్జేడీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన ఆ తరువాత 2018లో తిరిగి పార్టీలో చేరి తన తండ్రి మహమ్మద్ తస్లిముద్దీన్ మరణానంతరం అరారియా నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61988 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]