సర్ఫరాజ్ నౌషాద్ ఖాన్ (జననం 22 అక్టోబర్ 1997) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశీయ క్రికెట్‌లో ముంబై తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సర్ఫరాజ్ 2014, 2016లో ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సర్ఫరాజ్ ఖాన్ కుడిచేతి బ్యాటర్, పార్ట్ టైమ్ స్పిన్నర్,అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా ఆడుతాడు.
సర్ఫరాజ్ ఖాన్ 2024 ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు.[1] సర్ఫరాజ్ అరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్ లోనే 62 పరుగులు ( 66 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్‌తో 62 పరుగులు) చేశాడు.[2][3]
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన సర్ఫరాజ్ ఖాన్ ముంబై శివారులో పుట్టి పెరిగాడు. ఆయన తన బాల్యంలో ఎక్కువ భాగం ఆజాద్ మైదాన్‌లో గడిపాడు. అక్కడ తన తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ సర్ఫరాజ్ తో పాటు ఇక్బాల్ అబ్దుల్లా, కమ్రాన్ ఖాన్ వంటి యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా అండర్ 19 టీం ఇండియా జట్టులో ఉన్నాడు.[4]
సర్ఫరాజ్ ఖాన్ జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాకు చెందిన రొమానా జహూర్‌ని 2023 ఆగస్టు 6న వివాహం చేసుకున్నాడు.[5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)